Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రియాద్‌లోని టిసిఎస్ మ‌హిళా ఐటీ అండ్ ఐటిఇఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

రియాద్‌లోని టిసిఎస్ మ‌హిళా ఐటీ అండ్ ఐటిఇఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి


రియాద్ లో అంతా మ‌హిళలే ఉద్యోగులుగా పనిచేస్తున్న టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ కు చెందిన ఐటి అండ్ ఐటిఇఎస్ సెంట‌ర్‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంద‌ర్శించారు.

ప్ర‌ధాన మంత్రికి మహిళా ఉద్యోగులు ఉత్సాహంతో స్వాగ‌తం ప‌లికి, శుభాకాంక్ష‌లు తెలిపారు. వారితో ప్రధాన మంత్రి సంభాషించారు. కేంద్రం కార్యకలాపాల తీరును గురించి నిర్వాహ‌కులు ప్రధాన మంత్రికి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సౌదీ అరేబియాకు ఒక రకంగా గ‌ర్వ‌కార‌ణమైన ఉద్యోగుల‌ను తాను క‌లుసుకోవడం ప్ర‌పంచానికి ఒక పెద్ద సందేశాన్ని అందిస్తోంది అన్నారు.

ఇవాళ్టి పోటీ ప్రపంచంలో మ‌నం అందరం మనకున్న స‌హ‌జ‌సిద్ద‌మైన‌, మాన‌వ శక్తియుక్తులను సాధ్యమైనంత అధిక పురోగతిని సాధించడం కోసం కలసికట్టుగా ఉపయోగించుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి ప్ర‌స్థానంలో మ‌హిళా శ‌క్తి భాగ‌మైనప్పుడు ఆ ప్రయాణం సరికొత్త వేగాన్ని అందుకొంటుందన్నారు. ఈ కేంద్రంలో ఈ రోజు తాను గమనిస్తున్న వాతావ‌ర‌ణం ఈ ప్ర‌పంచానికి ఒక ధ‌నాత్మ‌క శ‌క్తిని సంతరిస్తుందనిపిస్తోందని ఆయన చెప్పారు. ఇక్క‌డి మ‌హిళా ఐటీ నిపుణులు భార‌త‌దేశాన్ని సంద‌ర్శించాల‌ని వారిని ఆయన ఆహ్వానించారు. వారి సంద‌ర్శ‌న భార‌త‌దేశంపై పెను ప్ర‌భావాన్ని ప్రసరింపచేయగలద‌న్నారు.

ప‌రిపాల‌నలో సాంకేతిక‌ విజ్ఞానం పోషించే పాత్ర‌ను గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కిచెప్పారు. త‌న దృష్టిలో e-governance అంటే ఈజీ గ‌వ‌ర్నెన్స్‌ అనే కాకుండా, ఇఫెక్టివ్ గ‌వ‌ర్నెన్స్‌, ఇంకా ఇక‌నామిక్ గ‌వ‌ర్నెన్స్ కూడా అని ఆయన అన్నారు.

“Narendra Modi App”ను చూడవలసిందిగా వారిని ప్ర‌ధాన మంత్రి కోరారు. భార‌త‌దేశంలో మ‌హిళల సాధికారిత‌ పైన వారి అభిప్రాయాలను నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు.

సెంటర్ లోని మెసేజ్ బోర్డు పైన ప్రధాన మంత్రి “వందే మాత‌రం. మాతృ దేవో భ‌వ‌” అని రాశారు.