Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రియో 2016 పారాలింపిక్స్ లో పతక విజేతలను అభినందించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 పారాలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన శ్రీ మరియప్పన్ తంగవేలుకు, కాంస్య పతకం సాధించిన వరుణ్ సింగ్ భాటీ కి అభినందనలు తెలిపారు. మరియప్పన్ మరియు వరుణ్ సింగ్.. వీరు ఇరువురూ పురుషుల హైజంప్ ఈవెంట్ లో పతకాలు గెలుచుకున్నారు.

“భారత దేశం ఉప్పొంగిపోతోంది! రియో 2016 పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన శ్రీ మరియప్పన్ తంగవేలుకు, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భాటీకి అభినందనలు” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.