పిఎంఇండియా
రెండు సార్లు పన్ను విధించడాన్ని నివారించడం మరియు ఆదాయంపై చెల్లించవలసిన పన్నులకు సంబంధించి ఫిస్కల్ ఇవేఝన్ కు పాల్పడడాన్ని నిరోధించడం కోసం భారతదేశానికి, తాజికిస్తాన్ కు మధ్య ఉన్న ఒప్పందాన్ని సవరించే ఒడంబడికల ప్రాథమిక పత్రానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ఒడంబడికల ప్రాథమిక పత్రం అమలులోకి వచ్చిన అనంతరం, ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డిటిఎఎ) లో భాగంగా మార్పిడి చేసుకొనే సమాచారాన్ని పన్నేతర ప్రయోజనాల కోసం ఇతర చట్ట అమలు ఏజెన్సీలతోనూ పంచుకొనేందుకు వీలు కల్పిస్తుంది.