Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రెన్యూవబుల్ ఎనర్జీ కో-ఆపరేషన్ రంగంలో సహకారం కోసం జనరల్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్


భారతదేశానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఎ ఇ) కి మధ్య పునర్ నవీకరణ యోగ్య శక్తి రంగంలో కుదిరిన ఒక జనరల్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ (జి ఎఫ్ ఎ) ను గురించి కేంద్ర మంత్రిమండలి సమావేశం దృష్టికి తీసుకువ‌చ్చారు. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు. జి ఎఫ్ ఎ పై ఈ సంవత్సరం ఫిబ్రవరి 11న యు ఎ ఇ యువ రాజు భారతదేశ పర్యటన సందర్భంగా న్యూ ఢిల్లీ లో సంతకాలు జరిగాయి.

పునర్ నవీకరణ యోగ్య శక్తికి, స్వచ్ఛ శక్తికి సంబంధించిన పరిశోధన మరియు అభివృద్ధి ప్రక్రియలలో సహకరించుకోవడానికి, విస్తృత‌ పరిధిని కలిగివుండే ప్రాజెక్టులకు, పెట్టుబడులకు, ఇతర రూపాలతో కూడిన వాణిజ్య సంబంధమైన ప్రయత్నాలకు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకొనేందుకు తగిన వేదికల నిర్మాణానికి అనువుగా ఒక ఫ్రేమ్ వర్క్ కు ప్రాతిపదికను ఉభయ పక్షాల మధ్య సమానత్వం, ఆదాన ప్రదానం మరియు పరస్పర ప్రయోజనాల పునాది పైన ఏర్పరచడమే ఈ జి ఎఫ్ ఎ ధ్యేయంగా ఉంటుంది. నూతన శక్తి సంబంధ సాంకేతిక విజ్ఞాన రంగంలోను, పునర్ నవీకరణ యోగ్య శక్తి సంబంధ సాంకేతిక విజ్ఞాన రంగంలోను భారతదేశం, యు ఎ ఇ ల మధ్య సహకారానికి ఉద్దేశించిందే జి ఎఫ్ ఎ . రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో పెట్టుబడికి గల అవకాశాలను అన్వేషించడానికి జి ఎఫ్ ఎ ఒక అవకాశాన్ని అందిస్తుంది; ఇంకా.. ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ కు సహకారాన్ని అందించడాన్ని కొనసాగిస్తుంది; రెన్యూవబుల్స్ లో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) ప్రక్రియ లలో సహకారానికి ఉన్న అవకాశాలేమిటనేది అన్వేషిస్తుంది; విజ్ఞానాన్ని పరస్పరం పంచుకొనేందుకు తగిన యంత్రాంగాలను రూపొందించి, తద్వారా ఆయా పక్షాలకు చెందిన మానవ మూలధన రాశి (హ్యూమన్ కేపిటల్)ని పెంపొందిస్తుంది; ఆయా పక్షాల మధ్య పెట్టుబడులకు వీలుగా ఒక సంయుక్త నిధిని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది; ఆయా పక్షాల పరస్పర సమ్మతి మేరకు ఇతరత్రా ఏ అంశాలలో సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చో అనే దానిని కూడా పరిశీలిస్తుంది.