పిఎంఇండియా
ద జనరల్ రిజర్వ్ స్ లో నుంచి రైల్వేలకు పెట్టుబడిగా పెట్టిన యావత్తు మూలధనం (డివిడెండ్ ఫ్రీ కేపిటల్ మినహా) పైన 2014-15, మరియు 2015-16 సంవత్సరాలకు గాను జనరల్ రిజర్వ్ కు రేట్ ఆఫ్ డివిడెండ్ ను క్రమానుగతంగా 5 శాతం మరియు 4 శాతంగా నిర్ధరించాలన్న రైల్వే కన్ వెన్షన్ కమిటీ (2014) సిఫారసులను అంగీకరించడం కోసం పార్లమెంట్ ఉభయ సభలలోను ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఇది రైల్వే కన్ వెన్షన్ కమిటీ (2014) రూపొందించిన తొలి నివేదిక లోని 5, 6, 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18 మరియు 19 పేరా లలోని సిఫారసులను రైల్వేల మంత్రిత్వ శాఖ అమలు చేయడానికి వీలు కల్పించగలదు.
***