Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్ పాల్ మరియు లోకాయుక్త ల (సవరణ) బిల్లు, 2016


లోక్ పాల్ మరియు లోకాయుక్త ల (సవరణ) బిల్లు, 2016ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం ద్వారా లోక్ పాల్ మరియు లోకాయుక్త ల చట్టం, 2013 సెక్షన్ 44 లో సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు, తత్పర్యవసానంగా ఈ చట్టంలో మరిన్ని సవరణల ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఆమోదం లభించిన సవరణలు లోక్ పాల్ మరియు లోకాయుక్త ల చట్టం, 2013 సెక్షన్ 44లోని అంశాలను అమలుపరచడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు వేరు వేరు కేటగిరీలకు చెందిన ప్రజా సేవకులు వ్యక్తం చేసిన భయాలను, ఆందోళనలను కూడా తొలగించగలుగుతాయి. ఈ సవరణలు స్థాయీ సంఘం చేసిన సిఫారసులలో ఒక సిఫారసుకు అనుగుణంగా ఉన్నాయి.

***