పిఎంఇండియా
వస్తువులు మరియు సేవల పన్ను (రాష్ట్రాలకు నష్టపూరణం) చట్టం, 2017ను తగు విధంగా సవరించడం కోసం ఒక అత్యవసర ఆదేశాన్ని జారీ చేయాలన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలిపింది.
ఈ ఆమోదం:
ఎ) డ్రైవరుతో సహా 13 మందికి మించకుండా చేరవేసే (870210, 8702 20, 8702 30, 8702 90 ఉప శీర్షికల పరిధి లోని) మోటారు వాహనాలకు; మరియు
బి) 8703 శీర్షికల పరిధిలోకి వచ్చే మోటారు వాహనాలకు
గరిష్ఠ రేటులో విధించదగ్గ కాంపెన్సేషన్ సెస్సును 15 శాతం నుండి 25 శాతానికి పెంచేందుకుగాను అనుమతిని ఇస్తుంది.
2017 ఆగస్టులో సమావేశమైన జిఎస్ టి కౌన్సిల్.. జిఎస్ టి కన్నా పూర్వకాలం లోని మొత్తం పన్ను, ఇన్సిడెన్స్ తో పోల్చి చూసినప్పుడు జిఎస్ టి ని ప్రవేశపెట్టిన అనంతరం టోటల్ ఇన్సిడెన్స్ ఆన్ మోటార్ వెహికిల్స్ (జిఎస్ టి ప్లస్ కాంపన్సేషన్ సెస్) దిగి వచ్చిందన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకొంది; 8702 మరియు 8703 శీర్షికల పరిధిలోకి వచ్చే మోటారు వాహనాలకు గరిష్ఠ రేటులో విధించదగ్గ కాంపన్సేశన్ సెస్సును 15 శాతం నుండి 25 శాతానికి పెంచాలని జిఎస్ టి కౌన్సిల్ సిఫారసు చేసింది.
మోటారు వాహనాలకు వర్తించే కాంపన్సేశన్ సెస్సు రేటులో పెరుగుదలకు సంబంధించిన అంశాన్ని జిఎస్ టి కౌన్సిల్ కాలక్రమంలో పరిశీలిస్తుంది.
***