పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోద అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం, ఇండియా, ఇరాన్ల మధ్య పరస్పర ప్రయోజనకర అంశాలలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా వాణిజ్య పరిష్కారచర్యలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు గతంలో కుదిరిన అవగాహనా ఒప్పందానికి(ఎం.ఒ.యు) అనుమతి మంజూరు చేసింది. ఇరాన్ అధ్యక్షుడు 2018 ఫిబ్రవరి 17న భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది.
వాణిజ్య పరిష్కారాల విషయంలో ఉభయ దేశాల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సామర్ధ్యాల పెంపు చర్యలు, యాంటీ డంపింగ్, కౌంటర్వెయిలింగ్ సుంకానికి సంబంధించి దర్యాప్తులో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఈ అవగాహనా ఒప్పందం వీలు కల్పిస్తుంది.