పిఎంఇండియా
నమస్కారం.
దేశ విదేశాల నుండి ఇందులో పాల్గొంటున్న అందరికీ ఇదే నా స్వాగతం. ప్రస్తుత కఠిన పరీక్ష కాలం లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, మీరంతా అందులో భాగస్వాములు కావడం ఓ కొత్త ఆశ ను కల్పించేది మాత్రమే కాక ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చేటటువంటి సందర్భం కూడాను.
భారతదేశం కరోనా వైరస్ తో యుద్ధం చేయడమే కాకుండా ఇందులో విజయాన్ని సాధించి ముందడుగు వేస్తుంది. ఈ సంక్షోభాన్ని భారతదేశం ఎంతమాత్రం చేతులు కట్టుకు చూస్తూ కూర్చోదు. అది ఎంతటి సవాలు అయినప్పటికీ దానిని ఒక అవకాశం గా మలుచుకోవాలన్న దృఢ సంకల్పం తో భారతదేశం ఉంది. ఈ కరోనా వైరస్ ‘ఆత్మనిర్భర్ ’ అంటే, స్వయం సమృద్ధి ని సాధించడం లో భారతదేశాని కి పాఠాల ను నేర్పింది!
‘ఆత్మనిర్భర్ భారత్’ అంటే దిగుమతుల పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం.. ఆత్మనిర్భర్ భారత్ అంటే దిగుమతులపై వెచ్చించే వేల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవడం.. ఆత్మనిర్భర్ భారత్ అంటే భారత్ దిగుమతులు చేసుకోవలసిన అవసరం లేకుండా నిరంతరం దేశీయ వనరుల ను అభివృద్ధి చేసుకోవడం.. ఆత్మనిర్భర్ అంటే- ఇప్పడు మేము ప్రస్తుతం దిగుమతి చేసుకొంటున్న వస్తు సామగ్రి ని భారీ స్థాయి లో విదేశాల కు పంపే ఎగుమతిదారు గా భారతదేశం ఎదగడం.
మిత్రులారా, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రతి రంగాన్నీ, ప్రతి ఉత్పత్తినీ, ప్రతి సేవనూ మనం మన చేతి లోకి తీసుకుని ఆయా రంగాల్లో భారత్ స్వయం సమృద్ధమయ్యే సంపూర్ణ కృషి ప్రారంభించాలి. ఈ ఆలోచన విధానం తో లక్ష్యం దిశ గా ముందడుగు వేయడానికి ఇవాళ్టి కార్యక్రమం ఒక ఉదాహరణ. నేడు ఇంధన రంగం లో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసే దిశ గా గొప్ప ముందంజ ను వేశాము. ఈ మేరకు ప్రస్తుత కార్యక్రమం ఒక్క రంగం లో… అంటే- బొగ్గు తవ్వకం లో సంస్కరణ ల అమలు ను చాటేది మాత్రమే కాదు… 130 కోట్ల మంది ఆకాంక్షల ను ప్రతిబింబించే కార్యక్రమం. యువత కు లక్షలాది ఉద్యోగాల ను సృష్టించేందుకు శ్రీకారం చుట్టే కార్యక్రమమిది.
మిత్రులారా, స్వావలంబన స్వప్న సాకారం దిశ గా గత నెల లో స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం గురించి ప్రకటించినప్పుడు ఇదో సీదాసాదా ప్రభుత్వ ప్రకటన గా చాలా మంది భావించారు. కానీ, ప్రకటన వెలువడిన నెల రోజుల్లోగా- వ్యవసాయం కావచ్చు.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్ఎస్ఎమ్ఇ) కావచ్చు లేదా ప్రస్తుత బొగ్గు- గనుల తవ్వకం రంగం కావచ్చు.. క్షేత్ర స్థాయి లో ప్రతి సంస్కరణ అమలు చేయబడుతోంది. ఈ సంక్షోభాన్ని అవకాశం గా మలచుకోవడం లో భారతదేశం దృఢ సంకల్పాన్ని, దీక్ష ను ప్రస్ఫుటం చేస్తున్న వాస్తవమిది. మేమివాళ బొగ్గు తవ్వకం వాణిజ్యీకరణపై వేలం ప్రారంభించడం మాత్రమేగాక దశాబ్దాల దిగ్బంధం నుండి బొగ్గు రంగం విముక్తి కి శ్రీకారం చుట్టాం. ఇప్పటిదాకా కొనసాగిన సదరు దిగ్బంధం ప్రభావమేమిటో నాకన్నా మీకే బాగా తెలుసు! నేనిప్పుడు చెప్పే వాస్తవాన్ని గురించి ఒక్క సారి ఆలోచించండి.. ప్రపంచం లో అత్యధిక బొగ్గు నిల్వలు కలిగిన దేశాలలో భారతదేశాని ది నాలుగో స్థానం; రెండో అతిపెద్ద ఉత్పత్తిదారులం మనమే; అయినప్పటికీ భారతదేశం బొగ్గు ఎగమతిదారు కాదు కదా.. రెండో అతి పెద్ద దిగుమతిదారు! మరి ప్రపంచం లో మనం రెండో అతి పెద్ద
ఉత్పత్తిదారు అయినప్పుడు అదే స్థాయి లో అతి పెద్ద ఎగుమతిదారు ఎందుకు కాలేకపోయాము?
ఇది నా మనస్సు ను మాత్రమే కాక మీతో పాటు కోట్లాది భారతీయుల మది ని తొలిచే ప్రశ్న.
మిత్రులారా, దశాబ్దాలు గా ఇదీ మన పరిస్థితి. దేశ బొగ్గురంగం ‘స్వీయ-స్వీయేతర’ నిర్బంధం లో చిక్కి విలవిలలాడుతోంది. పోటీతత్వాని కి దూరం గా ఉంచబడింది; పారదర్శకత ఓ ప్రధాన సమస్య గా మారింది. సముచిత వేలం ప్రక్రియ మాట అటుంచి, బొగ్గు గనుల కేటాయింపు లో భారీ కుంభకోణాలు చోటుచేసుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. పర్యవసానం గా బొగ్గు రంగం లో పెట్టుబడుల కొరత ఏర్పడింది. అలాగే ఈ రంగం సామర్థ్యం కూడా ప్రశ్నార్థకం అయింది. ఒక
రాష్ట్రం లో బొగ్గు ను వెలికితీస్తే వందలాది కిలోమీటర్ల దూరం లోని మరొక రాష్ట్రాని కి రవాణా అవుతుండగా, ఉత్పత్తి చేసే రాష్ట్రం మాత్రం బొగ్గు కోసం ఎదురుచూడవలసినటువంటి దు:స్థితి. ఇది చాలా గందరగోళం గా ఉంది.
మిత్రులారా, ఈ పరిస్థితి ని చక్కదిద్దడానికి 2014 వ సంవత్సరం నుండి అనేక చర్యల ను తీసుకొన్నాము. ఎవరూ ఊహించని రీతి లో బొగ్గు సంధానం ప్రక్రియ ను అమలు చేశాము. ఇటువంటి చర్య లు బొగ్గు రంగాని కి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. అలాగే దశాబ్దాలు గా మాటల కు మాత్రమే పరిమితమైన చాలా సంస్కరణల ను ఇటీవల ప్రవేశపెట్టాము. ఇప్పుడు పూర్తి స్థాయి బహిరంగ పోటీ, మూలధనం, భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానాల వైపు బొగ్గు, గనుల తవ్వకం రంగాన్ని నడిపేలా భారత ప్రభుత్వం ఓ బృహత్ నిర్ణయాన్ని తీసుకుంది. అదే కాలం లో ప్రైవేటు గనుల రంగం లో కొత్త భాగస్వాముల కు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాము.
మిత్రులారా, గనులు, ఖనిజ రంగాల బలమైన తోడ్పాటు లేనిదే స్వావలంబన సాధ్యం కాదు; ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థకు ఖనిజాలు- గనులు ముఖ్య మూలస్తంభాలు. ప్రస్తుత సంస్కరణ ల తరువాత ఇక బొగ్గు ఉత్పత్తి సహా మొత్తం బొగ్గు రంగం స్వీయాశ్రితం అవుతుంది. ఇప్పుడిక బొగ్గు బహిరంగ విపణి లోకి వచ్చినందువల్ల ఏ రంగమైనా తమ అవసరాల మేరకు కొనుగోలు చేయవచ్చు.
మిత్రులారా, ఈ సంస్కరణల తో బొగ్గు రంగం ఒక్కటే కాదు ఇతర రంగాలు
కూడా లబ్ధి ని పొందుతాయి. మనం బొగ్గు ఉత్పత్తి ని పెంచితే, విద్యుదుత్పాదన పెరుగుతుంది.. ఈ సానుకూల ప్రభావం ఉక్కు, అల్యూమినియమ్, ఎరువులు, సిమెంటు రంగాల లో ఉత్పత్తి, తయారీ ప్రక్రియల పైనా పడుతుంది. అదృష్టవశాత్తు భారతదేశం లో బొగ్గు, ఇనుము, బాక్సైట్ తదితర ఖనిజ నిల్వలు ఒకదానికి మరొకటి సమీపం లో ఉన్నాయి. అందువల్ల బొగ్గు తవ్వకం సంస్కరణ ల నుండి ఖనిజ రంగం లో సంస్కరణ లు బలం పుంజుకున్నాయి.
మిత్రులారా, బొగ్గు వాణిజ్య తరహా వేలం ఇవాళ ప్రారంభం కావడం భాగస్వాములందరికీ ఉభయతారకం. పరిశ్రమలకు.. మీకు.. మీ వ్యాపారాల కు.. పెట్టుబడుల కు కొత్త వనరులు, విపణులు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వాల కు మరింత రాబడి ఉంటుంది. అన్నిటికీ మించి దేశం లో అత్యధిక యువతీయువకుల కు ఉపాధి లభిస్తుంది. అంటే- ప్రతి రంగం పైనా సానుకూల ప్రభావం ఉంటుందన్నమాట.
మిత్రులారా, బొగ్గు రంగం లో సంస్కరణ అమలు నేపథ్యం లో పర్యావరణ పరిరక్షణ లో భారతదేశం యొక్క వచనబద్ధత బలహీనపడకుండా జాగ్రత్త వహించాము. ఆ మేరకు బొగ్గు ను వాయువు గా మార్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టబడుతుంది. ఆ విధం గా బొగ్గు ను వాయువు రూపం లోకి మార్చే చర్యల తో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. బొగ్గు వాయువు ను రవాణా చేయవచ్చు.. వంట కు ఉపయోగించవచ్చు.. ఇక యూరియా, ఉక్కు లు తయారీ పరిశ్రమల ను ప్రోత్సహించగలుగుతాయి. ఈ నేపథ్యం లో 2030 వ సంవత్సరం కల్లా 100 మిలియన్ టన్నుల బొగ్గు ను వాయువు గా మార్చే సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యం గా నిర్దేశించుకొన్నాము. దీనికోసం ఇప్పటికే నాలుగు ప్రాజెక్టుల ను గుర్తించగా, ఈ ప్రక్రియ లో 20,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వస్తాయని నాకు సమాచారం ఉంది.
మిత్రులారా, బొగ్గు రంగం లో సంస్కరణలు మన తూర్పు-మధ్య భారత ప్రాంతాలు సహా గిరిజన ప్రదేశాల ప్రగతి కి భారీ మూలాధారాలు కాగలవు. మన దేశం లో బొగ్గు, ఖనిజాలు గల ప్రాంతాలు ఆపేక్షిత స్థాయి లో ప్రగతి కి, సౌభాగ్యానికి నోచుకోలేదు. అంతేకాకుండా దేశం లోని అనేక ఆకాంక్షభరిత జిల్లా లు కూడా ఈ ప్రాంతాల లో పెద్ద సంఖ్య లో ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని ప్రజలు అభివృద్ధి ని ఆకాంక్షిస్తున్నా ఆ దిశ గా ఇంకా వెనుకబడి ఉన్నారు.
దేశం లోని 16 ఆకాంక్షభరిత జిల్లా ల పరిధి లో భారీ బొగ్గు నిల్వలుండగా, ప్రజల కు మాత్రం దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లభించడం లేదు. ఈ ప్రదేశాల కు చెందిన అనేక మంది ఉపాధి వేట లో సుదూర నగరాల కు వలస బాట పట్టవలసిన దు:స్థితి ఏర్పడింది.
గనుల తవ్వకం లో వాణిజ్యీకరణ కు చేపట్టిన చర్యలు తూర్పు-మధ్యభారత ప్రాంతాల లోని భారీ జనాభా కు వారి ఆవాసాల సమీపం లోనే ఉపాధి అవకాశాల ను కల్పించి, వలస వెళ్లడం వంటి దు:స్థితి ని తొలగించడానికి దోహదపడతాయి.
ఇవాళ ప్రారంభించిన బొగ్గు గనుల వేలంపాట ప్రక్రియ తోనే లక్షలాది ఉద్యోగాల సృష్టి సాధ్యపడుతుంది. ఇదొక్కటే కాదు.. బొగ్గు వెలికితీయడం నుండి రవాణా దాకా అవసరమైన మౌలిక సదుపాయాల ద్వారా కూడా ఉద్యోగావకాశాల సృష్టి జరుగుతుంది. ఈ నేపథ్యం లో ఇటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం 50,000 కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది.
మిత్రులారా, బొగ్గు రంగం లో సంస్కరణ లు పెట్టుబడులు ప్రజల కు.. ముఖ్యం గా పేదల- గిరిజన సోదరీసోదరుల కు జీవన సౌలభ్యం కల్పన లో కీలక పాత్ర పోషిస్తాయి. బొగ్గు ఉత్పాదన ద్వారా లభించే అదనపు రాబడి ని ఆ ప్రాంతాల లోని ప్రజల సంక్షేమం దిశ గా వివిధ పథకాల కోసం ఉపయోగిస్తాం. అలాగే జిల్లా ఖనిజ నిధి నుండి రాష్ట్రాల కు ఎప్పటిలాగానే సాయం కొనసాగుతుంది. ఈ నిధి లో అధిక శాతాన్ని బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో అత్యవసన సదుపాయాల అభివృద్ధి కి వినియోగిస్తాము. ఖనిజ సంపన్న ప్రాంతాల ప్రజల ను సంపన్నల ను చేయాలన్న లక్ష్యం తో ముందుకు వెళ్తున్నాం. నేడు చేపడుతున్న చర్య లు ఆ లక్ష్య సాధన లో ఎంతగానో దోహదం చేస్తాయి.
మిత్రులారా, దేశం లో ఆర్థిక కార్యకలాపాలు జోరు గా సాధారణ స్థాయి కి చేరుతున్న వేళ ఈ వేలం సాగుతోంది. వినియోగం- గిరాకీ వేగం గా కోవిడ్-19 కన్నా క్రితం స్థాయి ని అందుకొంటున్నాయి. కాబట్టి ఇందుకు ఇంతకన్నా మంచి తరుణం మరేముంటుంది!
గత నెల- మే ఆఖరు వారం నుండి జూన్ తొలి వారం మధ్య విద్యుత్తు వినియోగంతో పాటు పెట్రోలియమ్ ఉత్పత్తుల కు గిరాకీ జోరందుకుంది. ఆ మేరకు ఏప్రిల్ నెల తో పోలిస్తే ‘ఇ-వేబిల్లు ల’ జారీ దాదాపు 200 శాతం స్థాయి కి దూసుకుపోయింది. రహదారి సుంకం వసూళ్లు ఫిబ్రవరి తో పోలిస్తే జూన్ లో ఇప్పటికే 70 శాతం స్థాయి కి చేరుకొన్నాయి. ఏప్రిల్ తో పోలిస్తే మే నెల లో రైళ్ల లో సరకు రవాణా కూడా 26 శాతం పెరిగింది. అలాగే రీటేల్ డిజిటల్ పేమెంట్స్ లోనూ పరిమాణం- ప్రమాణం ల రీత్యా స్పష్టమైన పెరుగుదల నమోదైంది.
మిత్రులారా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఊర్ధ్వముఖం పట్టింది. ఈ సంవత్సరం ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం నిరుటి తో పోలిస్తే 13 శాతం అధికం గా ఉంది. గోధుమ ఉత్పత్తి, కొనుగోళ్లు కూడా ఈ సారి పెరిగాయి. ఆ మేరకు గత సంవత్సరం తో పోలిస్తే ఈ సారి ఇప్పటికే 11 శాతం అధికం గా నమోదు అయింది. అంటే- రైతుల కు మరింత డబ్బు సమకూరిందన్న మాట. ఈ సూచీలన్నిటిని పరిశీలిస్తే.. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకొని, ముందడుగు వేయడానికి సిద్ధం గా ఉందని అర్థం కావడం లేదూ!
మిత్రులారా, భారతదేశం లోగడ ఇంత కన్నా పెను సంక్షోభాల నుండి విజయవంతం గా బయటపడింది.. ఇప్పుడూ జరిగేది అదే. భారతీయులం కోట్లాది వినియోగదారులం మాత్రమే కాక, కోట్లాది ఉత్పత్తిదారులం కూడా. కాబట్టి భారతదేశం విజయం, వృద్ధి తథ్యం. మనం స్వయం సమృద్ధం కాగలమనడం లో సందేహమే లేదు!
ఒక్కసారి గుర్తు కు తెచ్చుకోండి.. కొన్ని వారాల కిందట మనం పెద్ద సంఖ్య లో ఎన్-95 మాస్కు లు, కరోనా పరీక్ష పరికరాలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి (పిపిఇ), వెంటిలేటర్ లు తదితరాల ను దిగుమతి చేసుకొనేవాళ్లం. కానీ, ఇవాళ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా తనకు అవసరమైన వాటిని భారతదేశమే స్వయం గా సమకూర్చుకుంటోంది. అంటే- త్వరలోనే మనం ఔషధ ఉత్పత్తుల ముఖ్యమైన ఎగుమతిదారు గా ఎదుగుతాం. ఆ మేరకు మీరు ‘మనం చేయగలం’ అనే నమ్మకం తోను, నైతికస్థైర్యం తోను ముందడుగు వేయండి. మనం ఖచ్చితం గా స్వయం సమృద్ధ భారతం గా అవతరించగలం!
మనం స్వయం సమృద్ధ భారతాన్ని నిర్మించగలం!
దేశం లోని 130 కోట్ల మంది భారతీయులు శ్రీకారం చుట్టిన ఈ స్వావలంబన భారత
పయనం లో మీరంతా ప్రధాన భాగస్వాములు. భారతదేశాన్ని ముందుకు నడిపి, స్వయంసమద్ధ భారతం గా రూపొందిద్దాం, రండి!
బొగ్గు రంగంలో విశేషమైనటువంటి నాందీ ప్రస్తావన ను చేసిన సందర్భం లో మరొక సారి మీకందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
మనమంతా ఏదో ఒకటి సాధించి చరిత్ర గతి ని మలుపు తిప్పే అవకాశాలు జీవితం లో కొన్నిమాత్రమే వస్తాయి. ఆ మేరకు ఇవాళ ప్రజల కు స్వస్థత ను చేకూర్చడం ద్వారా నేడు చరిత్ర ను మార్చే అవకాశం పారిశ్రామిక లోకాని కి, భారతదేశం యొక్క సేవల రంగాని కి లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. రండి, భారతదేశాన్ని ముందుకు నడిపి, ఒక స్వయం సమృద్ధ దేశం గా రూపొందిద్దాం.
మిత్రులారా, నేడు మీతో భేటీ అయ్యే అవకాశం నాకు లభించింది. ఇది బొగ్గు కు సంబంధించిన అంశం అయినప్పటికీ మనం మాత్రం వజ్రం వటి కలలను కనాలి. బొగ్గు రంగం లో ఈ విశేషమైనటువంటి నాందికి గాను మీకందరికీ నేను మరో సారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ మంత్రిత్వ శాఖ లోని అన్ని అంశాల ను క్షుణ్నం గా, సమర్థం గా అధ్యయనం చేయడం కోసం ప్రస్తుత దిగ్బంధ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న నా మంత్రిమండలి సహచరుడు ప్రహ్లాద్ జోశి గారి తో పాటు ఆయన వెంట నడచిన యావత్తు బృందాన్ని మరొక్క మారు అభినందిస్తున్నాను. దేశ హితాని కి తోడ్పడగల, గొప్ప నాయకత్వాన్ని అందించగల నవ్య మార్గాన్వేషణకు గాను ప్రహ్లాద్ జోశి గారి ని, ఆయన యొక్క కార్యదర్శి ని, వారి బృందాన్ని అభినందించ దలచాను. దీనిని మీరు ఒక సాధారణ కార్యక్రమం అని భావిస్తూ ఉండవచ్చు.. కానీ, నేను అలాగ అనుకోవడం లేదు. ప్రహ్లాద్ గారూ, స్వావలంబనయుత భారతదేశం దిశ గా మీరు ఈ రోజు న బలమైనటువంటి పునాది ని వేశారని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకు గాను మీకు, మీ జట్టు కు నా హృదయపూర్వక అభినందనలు.
ఈ సందర్భం లో నేను మీతోనే ఉంటానని నా పారిశ్రామిక మిత్రులందరికీ మరోసారి హామీ ఇస్తున్నాను. దేశ సంక్షేమం కోసం మీరు రెండు అడుగులు వేస్తే నేను మీతో నాలుగు అడుగులు వేయడానికి సదా సిద్ధం. రండి… ఈ
అవకాశాన్ని మనం వృథా పోనీయకూడదు.
మరొక్క మారు, మీకందరికీ ఇవే నా శుభాకాంక్షలు, ధన్యవాదాలూను.
देश और विदेश से इस इवेंट में हिस्सा ले रहे सभी साथियों का बहुत-बहुत स्वागत है।
— PMO India (@PMOIndia) June 18, 2020
इतने Challenging Time में इस तरह के इवेंट का होना, आप सभी का उसमें शामिल होना, अपने आप में एक बड़ा संदेश लिए हुए है: PM @narendramodi
भारत कोरोना से लड़ेगा भी और आगे भी बढ़ेगा।
— PMO India (@PMOIndia) June 18, 2020
भारत इस बड़ी आपदा को अवसर में बदलेगा।
कोरोना के इस संकट ने भारत को आत्मनिर्भर भारत- Self Reliant होने का सबक दिया है: PM @narendramodi
आत्मनिर्भर भारत यानि भारत Import पर अपनी निर्भरता कम करेगा।
— PMO India (@PMOIndia) June 18, 2020
आत्मनिर्भर भारत यानि भारत Import पर खर्च होने वाली लाखों करोड़ रुपए की विदेशी मुद्रा बचाएगा।
आत्मनिर्भर भारत यानि भारत को Import न करना पड़े, इसके लिए वो अपने ही देश में साधन और संसाधन विकसित करेगा: PM @narendramodi
आज Energy Sector में भारत को आत्मनिर्भर बनाने के लिए, Self Reliant बनाने के लिए एक बड़ा कदम उठाया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 18, 2020
महीने भर के भीतर ही, हर घोषणा, हर रिफॉर्म्स, चाहे वो Agriculture Sector में हो, चाहे MSMEs के सेक्टर में हो या फिर अब Coal और Mining के Sector में हो, तेज़ी से ज़मीन पर उतर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 18, 2020
ये दिखाता है कि भारत इस Crisis को Opportunity में बदलने के लिए कितना गंभीर है, कितना Committed है।
— PMO India (@PMOIndia) June 18, 2020
आज हम सिर्फ Commercial Coal Mining के लिए Auction ही Launch नहीं कर रहे हैं, बल्कि Coal Sector को दशकों के लॉकडाउन से भी बाहर निकाल रहे हैं: PM @narendramodi
जो देश Coal Reserve के हिसाब से दुनिया का चौथा सबसे बड़ा देश हो,
— PMO India (@PMOIndia) June 18, 2020
जो दुनिया का दूसरा सबसे बड़ा Producer हो,
वो देश Coal का Export नहीं करता बल्कि वो देश दुनिया का दूसरा सबसे बड़ा Coal Importer हैं: PM @narendramodi
हमारे यहां दशकों से यही स्थिति चल रही थी।
— PMO India (@PMOIndia) June 18, 2020
देश के Coal Sector को Captive और Non-captive के जाल में उलझाकर रखा गया था।
इसको Competition से बाहर रखा गया था, Transparency की एक बहुत बड़ी समस्या थी: PM @narendramodi
साल 2014 के बाद इस स्थिति को बदलने के लिए एक के बाद एक कई कदम उठाए गए।
— PMO India (@PMOIndia) June 18, 2020
जिस कोल लिंकेज की बात कोई सोच नहीं सकता था, वो हमने करके दिखाया।
ऐसे कदमों के कारण Coal Sector को मजबूती भी मिली: PM @narendramodi
अब भारत ने Coal और Mining के सेक्टर को competition के लिए, capital के लिए, Participation और Technology के लिए, पूरी तरह से खोलने का बहुत बड़ा फैसला लिया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 18, 2020
एक मजबूत माइनिंग और मिनरल सेक्टर के बिना Self Reliance संभव नहीं है।
— PMO India (@PMOIndia) June 18, 2020
क्योंकि Minerals और Mining हमारी Economy के Important Pillars हैं।
इन रिफॉर्म्स के बाद अब Coal Production, पूरा Coal Sector भी एक प्रकार से आत्मनिर्भर हो पाएगा: PM @narendramodi
जब हम Coal Production बढ़ाते हैं तो Power Generation बढ़ने के साथ ही Steel, Aluminum, फर्टिलाइजर, सीमेंट जैसे तमाम दूसरे सेक्टर्स में Production और Processing पर भी Positive Impact होता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 18, 2020
Commercial Coal Mining के लिए आज जो ये Auction की शुरुआत हो रही है वो हर Stakeholders के लिए Win-win Situation है।
— PMO India (@PMOIndia) June 18, 2020
इंडस्ट्रीज को, आपको, अपने बिजनेस, अपने investment के लिए अब नए Resources मिलेंगे, नया मार्केट मिलेगा: PM @narendramodi
Coal Reforms करते समय इस बात का भी ध्यान रखा गया है कि Environment की रक्षा का भारत का कमिटमेंट कहीं से भी कमजोर न पड़े।
— PMO India (@PMOIndia) June 18, 2020
Coal से Gas बनाने के लिए अब बेहतर और आधुनिक टेक्नॉलॉजी आ पाएगी, कोल गैसीफिकेशन जैसे कदमों से Environment की भी रक्षा होगी: PM @narendramodi
हमने लक्ष्य रखा है कि साल 2030 तक करीब 100 मिलियन टन Coal को Gasify किया जाए।
— PMO India (@PMOIndia) June 18, 2020
मुझे बताया गया है कि इसके लिए 4 प्रोजेक्ट्स की पहचान हो चुकी है और इन पर करीब-करीब 20 हज़ार करोड़ रुपए Invest किए जाएंगे: PM @narendramodi
Coal Sector से जुड़े ये रिफॉर्म्स Eastern और Central India को, हमारी Tribal Belt को, Development का Pillar बनाने का भी बहुत बड़ा ज़रिया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 18, 2020
देश में 16 Aspirational Districts ऐसे हैं, जहां कोयले के बड़े-बड़े भंडार हैं। लेकिन इनका लाभ वहां के लोगों को उतना नहीं हुआ, जितना होना चाहिए था।
— PMO India (@PMOIndia) June 18, 2020
यहां से बड़ी संख्या में हमारे साथी दूर, बड़े शहरों में Employment के लिए Migration करते हैं: PM @narendramodi
कोयला निकालने से लेकर Transportation तक को बेहतर बनाने के लिए जो आधुनिक इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा, उससे भी रोज़गार के अवसर बनेंगे, वहां रहने वालों को अधिक सुविधाएं मिलेंगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 18, 2020
कोल सेक्टर में हो रहे रीफॉर्म, इस सेक्टर में हो रहा निवेश, लोगों के जीवन को, विशेषकर हमारे गरीब और आदिवासी भाई-बहनों के जीवन को आसान बनाने में बहुत बड़ी भूमिका निभाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 18, 2020
ये Auction ऐसे समय में हो रहे हैं, जब भारत में Business Activity तेज़ी से नॉर्मल हो रही है।
— PMO India (@PMOIndia) June 18, 2020
Consumption और Demand बड़ी तेज़ी से pre-COVID level की तरफ आ रही है।
ऐसे में इस नई शुरुआत के लिए इससे बेहतर समय नहीं हो सकता: PM @narendramodi
ये जितने भी Indicators हैं, वो दिखा रहे हैं कि Indian Economy तेज़ी से Bounce Back करने के लिए तैयार हो गई है, आगे चल पड़ी है।
— PMO India (@PMOIndia) June 18, 2020
साथियों,
भारत बड़े से बड़े संकटों से बाहर निकला है, इससे भी निकलेगा: PM @narendramodi
भारत की Success, भारत की Growth निश्चित है।
— PMO India (@PMOIndia) June 18, 2020
हम आत्मनिर्भर बन सकते हैं।
आप याद करिए,
सिर्फ कुछ सप्ताह पहले तक हम N-95 मास्क, कोरोना की टेस्टिंग किट, Personal Protective Equipment- PPE, वेंटिलेटर, अपनी जरूरत का ज्यादातर हिस्सा हम बाहर से मंगाते थे: PM @narendramodi
आप अपना विश्वास, अपना हौसला बुलंद रखिए,
— PMO India (@PMOIndia) June 18, 2020
हम ये कर सकते हैं।
हम आत्मनिर्भर भारत बन सकते हैं।
हम आत्मनिर्भर भारत बना सकते हैं।
Self Reliant India की जो Journey 130 करोड़ भारतीयों ने शुरु की है, उसमें आप सभी उसके बहुत बड़े भागीदार हैं: PM @narendramodi