Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాతావరణ మార్పులను తట్టుకునే నీటి నిర్వహణ, నీటి భద్రత కోసం చేపడుతున్న


కేంద్ర మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

నీటి భద్రత అందరి బాధ్యత అని, ఇందుకోసం పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్, నమామీ గంగే, జల సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నీటి నిర్వహణ వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి తన వ్యాసంలో వివరించారని శ్రీ మోదీ తెలిపారు. రాష్ట్రాలు, వివిధ సమాజాలు నిరంతరం చేపట్టే ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటే, భవిష్యత్తు తరాలకు నీటిని సుస్థిరంగా ఎలా అందించగలదనే విషయాన్ని ఈ వ్యాసం వివరిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘నీటి భద్రత అందరి బాధ్యత. ఇందుకోసం పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం అవసరం.

 జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నీటి నిర్వహణ వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి కేంద్ర మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ రాశారు.

రాష్ట్రాలు, వివిధ సమాజాలు నిరంతరం చేపట్టే చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం తోడైతే, భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన రీతిలో నీటి భద్రతను ఎలా కల్పించవచ్చో ఈ వ్యాసం స్పష్టంగా వివరిస్తుంది”