Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విద్యుత్తు ఉత్పాదన వ్యయం తగ్గింపునకు దేశీయ బొగ్గు వినియోగంలో వెసులుబాటు


విద్యుత్తు ఉత్పత్తికి అవుతున్న వ్యయాన్ని తగ్గించడానికి దేశీయ బొగ్గు వినియోగంలో వెసులుబాటును కల్పించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

సమర్థ ఉత్పత్తి కేంద్రాలలో సాధ్యమైనంత అధిక స్థాయిలో దేశీయ బొగ్గును వినియోగించేందుకు అనుమతిని ఇవ్వడమే ఈ ప్రతిపాదనలోని ముఖ్యోద్దేశం. తద్వారా- విద్యుత్తు ఉత్పత్తి వ్యయం తగ్గటంతో పాటు రాష్ట్రాల విద్యుత్తు పంపిణీ సంస్థల విద్యుత్తు కొనుగోలు వ్యయం కూడా తగ్గుతుంది. ఈ రకమైన వెసులుబాటు బొగ్గు నుంచి విద్యుత్తును ఉత్పత్త్తి చేసే ప్రక్రియ లోను, పరికరాల సామర్థ్యాన్ని పెంచడం లోను, రవాణా ఖర్చులను వీలైనంత మేరకు కుదించడం లోను తోడ్పడగలదు.

ఇది సహజ వనరులను సాధ్యమైనంత అధిక స్థాయిలో, సమర్ధంగా వినియోగించుకోవడానికి ఒక కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. అంతే కాక దేశ విద్యుత్తు రంగానికి మొత్తంమీద ఆర్థిక ప్రయోజనాన్ని సైతం చేకూర్చుతుంది. బొగ్గు రవాణా వ్యయం తక్కువ కావడం, రవాణాకు ఉపయోగించే శక్తిని ఆదా చేయడం, రైలు మార్గాలపై రద్దీని తగ్గించడం వంటి వాటికీ ఇది దారి తీయగలదు. తక్కువ బొగ్గును ఉపయోగించి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయడం, బొగ్గును చేరవేయవలసిన దూరం తగ్గడం అనేవి పర్యావరణ స్నేహపూర్వకమైన చర్యలు.

ఈ ప్రతిపాదన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యు డి ఎ వై పథకానికి అనుగుణంగా ఉంది. అంత సమర్థంగా పనిచేయకుండా ఉన్న కేంద్రాల నుంచి బొగ్గు స్వాంప్స్ ను సమర్థంగా పనిచేస్తున్న కేంద్రాలకు తరలించడానికి వీలు కల్పించాలని, అలాగే బొగ్గు గనులకు దూరంగా నెలకొన్నప్లాంటుల నుంచి బొగ్గు స్వాంప్స్ ను పిట్ హెడ్ కు దగ్గరగా ఉన్న ప్లాంటుల వద్దకు తరలించడానికి వీలు కల్పించాలని ఈ ప్రతిపాదన లోనూ పేర్కొన్నారు. ఇలా చేసినపుడు.. విద్యుత్తు ఉత్పాదక వ్యయాన్ని కుదించడం సాధ్యపడుతుంది.

ఆయా రాష్ట్రాలలోని వివిధ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల దీర్ఘకాల కోల్ లింకేజిలను జత చేసి ఆ యా రాష్ట్రాలకు గాని, లేదా రాష్ట్రం నామినేట్ చేసిన ఏజెన్సీకి గాని అప్పగించాలని ప్రతిపాదన సూచిస్తోంది. అలాగే ఆయా సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ (సి జి ఎస్) కోల్ లింకేజిలను కూడా జత చేసి సీజీఎస్ యాజమాన్యంలోని కంపెనీకి అప్పగించాలని కూడా సూచించింది. ఇలా చేసినపుడు కేటాయించిన బొగ్గును ఉత్పత్తి కేంద్రాలు సమర్థంగా వినియోగించుకోగలవనేదే ఈ ప్రతిపాదనలోని పరమార్థం.

రాష్ట్రాల యాజమాన్యంలోని సంస్థలకు చెందిన ఉత్పత్తి కేంద్రాల, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్లాంటుల, సి జి ఎస్ మరియు ఐ పి పి ల మధ్య ఆ తరహా బొగ్గును పరస్పరం వినియోగించుకోవడంలో వెసులుబాటు ను కల్పించాలి.

స్టేట్ / సెంట్రల్ జనరేటింగ్ ప్లాంట్స్ లో బొగ్గు వినియోగం విషయానికి వస్తే ప్లాంటు సామర్థ్యం, బొగ్గు రవాణా వ్యయం, ట్రాన్స్ మిషన్ ఛార్జీలు, ఇంకా మొత్తంమీద విద్యుత్తు వ్యయం.. వీటిని నిర్ణాయక ప్రాతిపదికలుగా ఎంచుతారు.

రాష్ట్రానికి అప్పగించిన బొగ్గును ప్రయివేట్ జనరేటింగ్ స్టేషన్స్ లో వినియోగించవలసి వస్తే, సబ్ స్టిట్యూటెడ్ కోల్ ద్వారా లభించే విద్యుత్తును ప్రయివేటు రంగంలోని ప్లాంటులు పోటీ పడి బిడ్ లు దాఖలు చేయడం ద్వారా కొనుగోలు చేయాలి. ఇందుకోసం బొగ్గు ఉత్పత్తి స్థానం, బొగ్గు నాణ్యత, విద్యుత్తు రాశి (క్వాంటమ్ ఆఫ్ పవర్), విద్యుత్తును అందుకొనేందుకు ఒక కేంద్రం (డెలివరీ పాయింట్ ఫర్ ద రిసీట్ ఆఫ్ పవర్) లను గురించి ముందస్తుగా సూచించవలసివుంటుంది.

వివిధ స్టేక్ హోల్డర్ లతో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్రీయ విద్యుత్తు ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ.. సి ఇ ఎ) రాష్ట్రాలకు వాటి సొంత జనరేటింగ్ స్టేషన్స్, సి జి ఎస్, మరియు ఐ పి పి లలో బొగ్గు ను ఎలా వినియోగించుకోవాలో విధి విధానాలను జారీ చేస్తుంది. అలాగే, సి జి ఎస్ ను కలిగి ఉన్న కంపెనీ బొగ్గును తన సొంత ప్లాంటులలో గాని, లేదా ఇతర ఎఫీషియెంట్ ప్లాంటులలో గాని వినియోగించుకొనేందుకు సంబంధించిన విధి విధానాలను కూడా సి ఇ ఎ నే జారీ చేస్తుంది.

పూర్వ రంగం:

మన దేశంలో విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గే ముఖ్యమైన వనరుగా ఉంది. ప్రధానంగా రెండు రకాలైన బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంటులు నెలకొన్నాయి. వీటిలో ఒకటో రకం పిట్ హెడ్ బేస్ డ్ ప్లాంటులు.. ఇవి బొగ్గు గనులకు దగ్గరగా ఉంటాయి. లోడ్ సెంటర్ ఆధారితమైన ప్లాంటులేమో రెండో రకం. ఇవి లోడ్ సెంటర్ కు దగ్గరగా ఉంటాయి. బొగ్గు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం, యూనిట్ సామర్థ్యం వంటి వాటిని బట్టి ఈ ప్లాంటుల సామర్థ్య స్థాయిలు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం మంచి సామర్థ్యం కలిగి ఉన్న పవర్ ప్లాంటులకు బొగ్గు కొరతగా ఉన్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటే, మరికొన్ని ప్లాంటులలో వాటి సామర్థ్యం కన్నా వినియోగం స్థాయి తక్కువగా ఉండడంతో ఎక్కువ బొగ్గు అందుబాటులో ఉంటోంది.

***