పిఎంఇండియా
వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిజిటలైజ్ చేయటం ద్వారా వివిధ సవాళ్లను ‘ఈ–జాగృతి’ ఎలా పరిష్కరిస్తుందనే అంశంపై కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. “వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ‘ఈ–జాగృతి’ మరింత మెరుగైందని, దీని ద్వారా వినియోగదారుల న్యాయ వ్యవస్థ కూడా డిజిటల్ సంస్కరణల దిశగా అడుగుల వేస్తోందని ఆయన ఈ కథనం ద్వారా వెల్లడించారు” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిజిటలైజ్ చేయటం ద్వారా వివిధ సవాళ్లను ‘ఈ–జాగృతి’ ఎలా పరిష్కరిస్తుందనే అంశాన్ని కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ కథనంలో వివరించారు.
వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ‘ఈ–జాగృతి’ మరింత మెరుగైందని తెలిపారు. దీని ద్వారా వినియోగదారుల న్యాయ వ్యవస్థ కూడా డిజిటల్ సంస్కరణలు జరుగుతున్న రంగాల జాబితాలో చేరిందని ఆయన చెప్పారు.
***
In this article, Union Minister Shri @JoshiPralhad elaborates on how e-Jagriti addresses multiple challenges by digitising the entire lifecycle of a consumer complaint.
— PMO India (@PMOIndia) July 4, 2026
He notes that, following extensive consultations with stakeholders, e-Jagriti has been refined, placing… pic.twitter.com/KJM6w1g1eT