Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విప‌త్తు నిర్వ‌హ‌ణ రంగంలో స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి, ఆర్మేనియా కు మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం విప‌త్తు నిర్వ‌హ‌ణ రంగంలో స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి, ఆర్మేనియా కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒయు) పై సంత‌కాలకు త‌న ఆమోదాన్ని తెలిపింది.

ఈ ఎమ్ఒయు విప‌త్తు నిర్వ‌హ‌ణ రంగంలో స‌హ‌కారాన్ని పెంపొందించ‌డ‌ంతో పాటు ఏదైనా విప‌త్తు సంభవించిన వేళ రెండు దేశాల ప్ర‌జ‌ల భ‌ద్ర‌తకు మ‌రియు క్షేమానికి తోడ్పాటును కూడా అందిస్తుంది. విప‌త్తు నిర్వ‌హ‌ణ సంబంధిత రంగాల‌లో ఉభ‌య దేశాల ప్ర‌యోజ‌నాలు ముడిప‌డి ఉండే స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డానికి కూడా ఇది దోహ‌దం చేస్తుంది.

అంతేకాకుండా, ఇటు భార‌త‌దేశం, అటు ఆర్మేనియా లు రెండూ అవ‌త‌లి దేశానికి చెందిన విప‌త్తు నిర్వ‌హ‌ణ యంత్రాంగాల నుండి ప్ర‌యోజ‌నం పొందే విధంగా ఒక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకూ ఈ ఎమ్ఒయు వీలు క‌ల్పిస్తుంది. అలాగే, స‌న్న‌ద్ధ‌త, ప్ర‌తిస్పంద‌న మ‌రియు సామ‌ర్ధ్య నిర్మాణ రంగాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో కూడా తోడ్పాటును అందిస్తుంది.