పిఎంఇండియా
అవగాహన ఒప్పందాలు/ ఒప్పందాలు
|
1. |
ఐఆర్ఈఎల్ (భారత్), వియత్నాంకు చెందిన రేడియోధార్మిక – అరుదైన మూలకాల సాంకేతిక సంస్థ (ఐటీఆర్ఆర్ఈ) మధ్య పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందం |
అరుదైన భూ మూలకాలతోపాటు ఇతర నూతన సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలన్న ఇరుపక్షాల దీర్ఘకాలిక నిబద్ధతను ఈ అవగాహన ఒప్పందం క్రమబద్ధీకరిస్తుంది. |
|
2. |
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, వియత్నాం సాంస్కృతిక, క్రీడా, పర్యాటక శాఖల మధ్య 2026-30 కాలానికి సాంస్కృతిక ఆదాన ప్రధాన కార్యక్రమం |
భారత్, వియత్నాం మధ్య 1976లో సాంస్కృతిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద చేపట్టాల్సిన నిర్దిష్ట కార్యకలాపాలు, పరస్పర వినిమయ కార్యక్రమాలకు ఈ సాంస్కృతిక ఆదాన ప్రధాన కార్యక్రమం పరిధిలో అంగీకారం కుదిరింది. దీని కాలపరిమితి అయిదేళ్లు (2026-2030). |
|
3. |
చెల్లింపుల వ్యవస్థల్లో సహకారం, డిజిటల్ చెల్లింపుల్లో ఆవిష్కరణలపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), వియత్నాం స్టేట్ బ్యాంకు (ఎస్బీవీ) మధ్య అవగాహన ఒప్పందం |
ఆర్థికపరమైన ఆవిష్కరణలు, డిజిటల్ చెల్లింపుల రంగంలో సహకారానికి సంబంధించి ఒక వ్యవస్థాగత ఏర్పాటు చేయడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. |
|
4. |
ఔషధ ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారంపై.. భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) – వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ పాలన విభాగం మధ్య అవగాహన ఒప్పందం |
ఔషధాలు, జీవ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాలు సహా ఔషధోత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారానికి సంబంధించి ఒక వ్యవస్థాగత ఏర్పాటు చేయాలన్నది ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. |
|
5. |
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ముంబయి – హో చి మిన్ సిటీ పీపుల్స్ కమిటీ మధ్య మైత్రిని, సహకారాన్ని నెలకొల్పడంపై అవగాహన ఒప్పందం |
పట్టణ నిర్వహణ, ఆర్థికాభివృద్ధి అంశాల్లో ఈ రెండు మహానగరాలు నైపుణ్యాలను పంచుకోవడానికి వీలుగా అధికారికంగా ఒక వ్యవస్థాగత ఏర్పాటు చేయడం ఈ ఒప్పంద లక్ష్యం. |
|
6. |
భారతీయ అధ్యయనాలకు సంబంధించి ఐసీసీఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడంపై.. ఐసీసీఆర్ – విజ్ఞాన శాస్త్ర, విద్య విశ్వవిద్యాలయం – డా నాంగ్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం |
ఈ అవగాహన ఒప్పందం వియత్నాంలోని డా నాంగ్ విశ్వవిద్యాలయంలో ఐసీసీఆర్ విభాగాన్ని నెలకొల్పుతుంది. |
|
7. |
రాజ్‌గిర్‌లోని నలంద విశ్వవిద్యాలయం, హనోయ్‌లోని హో చి మిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ పాలిటిక్స్ మధ్య అవగాహన ఒప్పందం |
వియత్నాం కోసం నైపుణ్యాభివృద్ధి, శిక్షణపరమైన సౌలభ్యం దిశగా భారత్ చేపట్టిన దీర్ఘకాలిక కార్యక్రమాలను ఈ అవగాహన ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది. |
|
8. |
డిజిటల్ సాంకేతికతల రంగంలో సహకారంపై భారత ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ – వియత్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం |
డిజిటల్ సాంకేతికతలు, ఐటీ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఇరుపక్షాల నిబద్ధతను ఈ అవగాహన ఒప్పందం బలోపేతం చేస్తుంది. |
|
9. |
ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), వియత్నాం జాతీయ చెల్లింపుల సంస్థ మధ్య అవగాహన ఒప్పందం |
చెల్లింపులను సులభతరం చేయడం కోసం సరిహద్దుల మధ్య క్యూఆర్ కోడ్ అనుసంధానం దిశగా.. భారత్‌కు చెందిన ఎన్ఐపీఎల్ – వియత్నాం ఎన్ఏపీఏఎస్ మధ్య సంస్థాగత అనుసంధానాన్ని ఈ అవగాహన ఒప్పందం నెలకొల్పుతుంది. |
|
10. |
ప్రభుత్వ రంగంలో ఆడిట్‌కు సంబంధించి.. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ – వియత్నాం ప్రభుత్వ ఆడిట్ కార్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం |
భారత్, వియత్నాం ఆడిట్ సంస్థల మధ్య 2010 నాటి అవగాహన ఒప్పందాన్ని ఇది పునరుద్ధరిస్తుంది. దీన్ని మరింత సౌలభ్యమైనదిగా, క్రియాశీలంగా చేస్తుంది. |
|
11. |
పర్యాటక రంగంలో సహకారంపై.. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ – వియత్నాం క్రీడా, సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం |
రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ఈ అవగాహన ఒప్పందం ప్రోత్సహిస్తుంది. |
|
12. |
భారతీయ అధ్యయనాలపై ఐసీసీఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడంపై.. ఐసీసీఆర్ – సామాజిక శాస్త్రాలు, మానవ విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం |
సామాజిక శాస్త్రాలు, మానవ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఐసీసీఆర్ విభాగాన్ని ఈ అవగాహన ఒప్పందం నెలకొల్పుతుంది. |
|
13. |
చామ్ రాతప్రతుల డిజిటలీకరణపై.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని జ్ఞాన భారతం – హో చి మిన్ నగరంలోని వియత్నాం జాతీయ విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్రాలు, మానవ విజ్ఞాన శాస్త్రాల విభాగం (యూఎస్ఎస్‌హెచ్, వీఎన్‌యూహెచ్‌సీఎం) మధ్య అవగాహన ఒప్పందం |
రాతప్రతుల సర్వే, ప్రమాణీకరణ, పరిరక్షణ, డిజిటలీకరణ, ప్రాచుర్యం కోసం.. ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రం – యూఎస్ఎస్‌హెచ్, వీఎన్‌యూహెచ్‌సీఎం మధ్య సంస్థాగత అనుసంధానాలను ఈ అవగాహన ఒప్పందం నెలకొల్పుతుంది. |
క్ర.సం. | శీర్షిక | సంక్షిప్త వివరణ |
|---|
ప్రకటనలు
|
క్ర.సం. |
శీర్షిక |
|
1. |
ద్వైపాక్షిక సంబంధాలను మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడం |
|
2. |
2030 నాటికి 25 బిలియన్ డాలర్ల సరికొత్త వాణిజ్య లక్ష్యం |
|
3. |
ఇండో పసిఫిక్ మహా సముద్రాల వేదిక (ఐపీవోఐ)లో వియత్నాం చేరిక |
|
4. |
వియత్నాంకు భారతీయ ద్రాక్ష, భారత్‌కు వియత్నాం దురియన్ ఎగుమతి ప్రకటన |
|
5. |
మై సన్ వద్ద ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతం వద్ద ప్రాదేశిక వివరణ కేంద్రాన్ని నెలకొల్పడం |
***
Addressing the joint press meet with President of Vietnam, Mr. To Lam.
— Narendra Modi (@narendramodi) May 6, 2026
https://t.co/ILXwDMIxkl
हमारी साझा विरासत को जीवंत रखने के लिए, हम वियतनाम के प्राचीन चम्पा सभ्यता के मी सॉन और न्हान टवर मंदिरों का restoration कर रहे हैं।
— PMO India (@PMOIndia) May 6, 2026
अब हम चम्पा सभ्यता की manuscripts को भी digitalize करेंगे,
और इस अमूल्य धरोहर को आने वाली पीढ़ियों के लिए संरक्षित करेंगे: PM @narendramodi
भारत और वियतनाम की साझेदारी में, विरासत और विकास- दोनों का महत्व है।
— PMO India (@PMOIndia) May 6, 2026
पिछले वर्ष, जब भारत से बौद्ध अवशेष वियतनाम गए,
तो उनके दर्शन, डेढ़ करोड़ से अधिक, यानि पूरे वियतनाम की population के 15% लोगों ने किया था: PM @narendramodi
हमारी drug authorities के बीच MOU से अब भारत की दवाइयों का वियतनाम में access बढ़ेगा।
— PMO India (@PMOIndia) May 6, 2026
भारत के agriculture, fisheries और animal products का भी,
वियतनाम तक export और सुगम होने जा रहा है: PM @narendramodi
Financial connectivity को भी boost करने के लिए, आज हमने अपने central banks के बीच सहयोग बढ़ाने का निर्णय किया है।
— PMO India (@PMOIndia) May 6, 2026
भारत के UPI और वियतनाम के फास्ट पेमेंट सिस्टम भी जल्द ही लिंक होने जा रहे हैं: PM @narendramodi
वियतनाम भारत की Act East Policy और विज़न महासागर का एक मुख्य स्तंभ है।
— PMO India (@PMOIndia) May 6, 2026
इंडो-पैसिफिक क्षेत्र में भी हमारा common outlook है।
हम अपनी सुदृढ़ होती हुई रक्षा और सुरक्षा सहयोग से, rule-of-law, शांति, स्थिरता और समृद्धि के प्रति योगदान देते रहेंगे।
वियतनाम के सहयोग से भारत, आसियान…
पहलगाम आतंकी हमले की कड़ी निंदा करने और आतंकवाद के विरुद्ध हमारे संघर्ष में साथ खड़े रहने के लिए हम वियतनाम के आभारी हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 6, 2026