పిఎంఇండియా
ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. విశిష్టమైన భారతీయ నాగరికత విశేషాల్లో ఒకటిగా చేనేతను ఈ వ్యాసం వర్ణించింది. అలాగే భారతీయ జౌళి రంగంలో ఉన్న అనేక ప్రాంతీయ సంప్రదాయాల గురించి వివరించింది.
‘‘చేనేత పరిశ్రమ తదుపరి అధ్యాయానికి రూపకల్పన చేయడం ద్వారా చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వారసత్వంతో సాంకేతికతను, సృజనాత్మకతతో వ్యాపారాన్ని మేళవించాలని దేశ యువతకు మంత్రి పిలుపునిచ్చారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
భారతదేశం ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా భారతదేశపు నాగరికత విశేషాల్లో ఒకటిగా చేనేతను కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. భారతీయ జౌళి పరిశ్రమలో ఉన్న అనేక ప్రాంతీయ సంప్రదాయాల గురించి వివరించారు.
చేనేత తదుపరి దశకు రూపకల్పన చేయడం ద్వారా చేనేత కార్మికులకు జీవనోపాధిని బలోపేతం చేసేలా వారసత్వాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో, సృజనాత్మకతను వ్యాపారంతో అనుసంధానించాలని దేశ యువతకు మంత్రి పిలుపునిచ్చారు.
As India marks #NationalHandloomDay today, Union Minister Shri @girirajsinghbjp lauds handloom as one of India’s greatest civilisational strengths, highlighting the countless regional traditions of Indian textiles.
— PMO India (@PMOIndia) August 7, 2026
The Minister calls upon India’s youth to bring together heritage… https://t.co/FaATaFySTa