Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశ్వసనీయ ఏఐ.. ఆవిష్కరణలు.. అంతర్జాతీయ సహకారంపై ‘మిస్ట్రల్ ఏఐ’ సీఈఓ ఆర్థర్ మెన్ష్‌తో ప్రధానమంత్రి సంభాషణ

విశ్వసనీయ ఏఐ.. ఆవిష్కరణలు.. అంతర్జాతీయ సహకారంపై ‘మిస్ట్రల్ ఏఐ’ సీఈఓ ఆర్థర్ మెన్ష్‌తో ప్రధానమంత్రి సంభాషణ


  కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానం ప్రపంచమంతటా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘మిస్ట్రల్ ఏఐ’ సంస్ధ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శ్రీ ఆర్థర్ మెన్ష్‌తో సమగ్రంగా చర్చించారు.

విశ్వసనీయ ఏఐ.. ఆవిష్కరణలు సహా మానవ కేంద్రకంగా, సార్వజనీనంగా కృత్రిమ మేధ విస్తరించేలా చూడాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా తాము చర్చించుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.

ఏఐ సంబంధిత వివిధ అంశాల్లో భారత్‌లో భాగస్వామ్యాలకుగల అవకాశాలను కూడా ఈ చర్చలో ప్రస్తావించానని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఆవిష్కరణలు.. పరస్పర విశ్వాసం.. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తూ, మానవాళికి సాధికారత కల్పించగల ఏఐ పరిష్కారాల రూపకల్పనపై భారత్‌ నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

ఈ చర్చలపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రపంచమంతటా కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ‘మిస్ట్రల్ ఏఐ’ సంస్థ సీఈఓ  శ్రీ ఆర్థర్ మెన్ష్‌తో కూలంకషంగా చర్చించాను. ఈ సందర్భంగా విశ్వసనీయ ఏఐ, ఆవిష్కరణలతోపాటు మానవ కేంద్రకంగా, సార్వజనీనంగా కృత్రిమ మేధ వ్యాప్తిలోకి రావాల్సిన అవసరంపై మేమిద్దరం అభిప్రాయాలు పంచుకున్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే…

“ఇదే సమయంలో ఏఐ సంబంధిత వివిధ అంశాల్లో భాగస్వామ్యం దిశగా భారత్‌లోగల విస్తృత అవకాశాలపైనా మేం సంభాషించాం. ఆవిష్కరణలు, పరస్పర విశ్వాసం సహా అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తూ, మానవాళికి సాధికారత ఇవ్వగల ఏఐ పరిష్కారాల రూపకల్పనకు భారత్‌ కట్టుబడి ఉందని నేను స్పష్టం చేశాను” అని ఆయన వివరించారు.

***