పిఎంఇండియా
గత 12 ఏళ్ల ప్రభుత్వ పాలన.. విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితమైందని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారత ప్రజల ఆశీస్సులు, దేశమే తొలి ప్రాధాన్యత అనే భావనతో యువత, మహిళలు, రైతు సోదరీసోదరులు సాధికారత కోసం శాయశక్తులా కృషి చేసేలా అన్ని ప్రయత్నాలు చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు.
అవిశ్రాంత కృషి ఫలితంగా మౌలిక సదుపాయాల కల్పన నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్ని రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా నేడు దేశం సరికొత్త గుర్తింపును పొందిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు సేవ, సుపరిపాలన, సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“గడిచిన 12 ఏళ్ల ప్రభుత్వ పాలన… విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితమైంది. 140 కోట్ల మంది భారత ప్రజల ఆశీస్సులు, దేశమే తొలి ప్రాధాన్యత అనే భావనతో యువత, మహిళలు, రైతు సోదరీసోదరులు సాధికారతకు శాయశక్తులా కృషి చేసేలా మేం అన్ని ప్రయత్నాలు చేశాం. నిరంతరం మేం చేసిన ప్రయత్నాల ఫలితంంగానే ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్ని రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా దేశానికి సరికొత్త గుర్తింపు లభించింది. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు సేవ, సుపరిపాలన, సంక్షేమం దిశగా మేం ముందుకు సాగుతాం.
#ప్రభుత్వ పాలనకు 12 ఏళ్లు”
***
हमारी सरकार के बीते 12 वर्ष विश्वास, विकास और जनकल्याण को समर्पित रहे हैं। 140 करोड़ देशवासियों के आशीर्वाद और राष्ट्र प्रथम की भावना से हमने युवाओं, महिलाओं और अपने किसान भाई-बहनों को सशक्त बनाने में कोई कोर-कसर नहीं छोड़ी है। यह हमारे अथक प्रयासों का ही परिणाम है कि… pic.twitter.com/URtsOWF4BT
— Narendra Modi (@narendramodi) June 9, 2026