Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ తొమ్మిదో సంచిక ను గాంధీన‌గ‌ర్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ తొమ్మిదో సంచిక ను గాంధీన‌గ‌ర్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ తొమ్మిదో సంచిక ను గాంధీన‌గ‌ర్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ తొమ్మిదో సంచిక ను గాంధీన‌గ‌ర్ లో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ తొమ్మిదో సంచిక ను గాంధీన‌గ‌ర్ లోని మ‌హాత్మ మందిర్ ఎగ్జిబిష‌న్ క‌మ్ క‌న్వెన్శన్ సెంట‌ర్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.  ఉజ్‌ బెకిస్తాన్‌, ర‌వాండా, డెన్మార్క్, చెక్ రిప‌బ్లిక్, ఇంకా మాల్టా.. ఈ 5 దేశాల అధినేత‌ల తో పాటు వివిధ రంగాల‌ కు చెందిన ప‌రిశ్ర‌మ సార‌థులు స‌హా దేశ, విదేశాల నుండి విచ్చేసిన 30,000 మంది కి పైగా ప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొంటున్నారు.

అవ‌స‌ర‌మైన‌టువంటి మౌలిక స‌దుపాయాలు అమ‌రిన భారతదేశం లో వ్యాపార సంబంధ వాతావరణం ప్రస్తుతం పెట్టుబ‌డిదారు కు మ‌రింత స్నేహ పూర్వ‌కంగా ఉందంటూ, భార‌త‌దేశాని కి వచ్చి పెట్టుబ‌డి పెట్ట‌వ‌ల‌సింది గా ప్ర‌పంచ వ్యాపార ప్ర‌ముఖుల‌ను మరియు కంపెనీల‌ ను ప్ర‌ధాన మంత్రి ఆహ్వానించారు.  “భార‌త‌దేశం ప్ర‌స్తుతం వ్యాపారానికి స‌న్న‌ద్ధం గా ఉంది.  గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో మేం వ్యాపార సౌల‌భ్యం తాలూకు ర్యాకింగ్ లలో 65 అంచెలు ఎగ‌బాకాం.  రానున్న కాలం లో అగ్ర‌గామి 50 స్థానాల లో భార‌త‌దేశం నిల‌బ‌డేట‌ట్లుగా చూడ‌టానికి క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండని నా బృందాని కి నేను సూచించాను” అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పట్ల, ఇటీవ‌లి కాలం లో తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ ల ప‌ట్ల ప్ర‌పంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ఇంకా మూడీజ్ ల వంటి అంత‌ర్జాతీయ సంస్థ‌ లు విశ్వాసాన్ని వ్య‌క్తం చేశాయ‌ని శ్రీ మోదీ అన్నారు.  “వ్యాపారాన్ని నిర్వ‌హించ‌డాన్ని సైతం మేం త‌క్కువ ఖ‌ర్చు క‌లిగింది గా మార్చివేశాం.  జిఎస్‌టి అమ‌లు, ఇంకా ప‌న్నుల స‌ర‌ళీక‌ర‌ణ కు ఉద్దేశించిన ఇత‌ర నిర్ణ‌యాలు లావాదేవీల ఖ‌ర్చుల‌ ను త‌గ్గించి వేయ‌డంతో పాటు ప్ర‌క్రియ‌ల‌ ను స‌మ‌ర్ధం గా తీర్చిదిద్దాయి.  డిజిట‌ల్ ప్ర‌క్రియ‌లు, ఇంకా ఒకేచోట ప‌రిష్కారాలు వంటి చ‌ర్య‌ల ద్వారా వ్యాపారం చేయ‌డాన్ని మేం వేగ‌వంతం చేసేశాం” అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

భార‌త‌దేశం యొక్క వృద్ధి ని గురించి, భార‌త‌దేశానికి ఉన్న‌టువంటి బ‌ల‌మైన ఆర్థిక పునాదుల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, “7.3 శాతం వ‌ద్ద జిడిపి స‌గ‌టు వృద్ధి రేటు 1991 నుండి చూస్తే  భార‌తదేశం లో మరే ప్ర‌భుత్వ హ‌యాం లో క‌న్నా అత్యున్న‌త‌మైందిగా ఉంది.  అదే కాలం లో 4.6 శాతం స్థాయి లో ద్ర‌వ్యోల్బ‌ణ స‌గ‌టు రేటు కూడా భార‌త‌దేశం లో స‌ర‌ళీక‌ర‌ణ ప్ర‌క్రియ ఆరంభ‌మైన 1991 సంవ‌త్స‌రం నాటి నుండి గ‌మ‌నిస్తే మ‌రే ప్ర‌భుత్వ హ‌యాం లో క‌న్నా అత్యంత త‌క్కువ గా ఉంది” అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

“భార‌త‌దేశాన్ని త‌ర‌చుగా సంద‌ర్శించే వారు దిశ ప‌రంగాను, తీవ్ర‌త ప‌రంగాను గాలి లో ఒక మార్పు వ‌చ్చిన సంగ‌తి ని గుర్తించగ‌లుగుతారు. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో ప్ర‌భుత్వాన్ని త‌గ్గించి, పాల‌న‌ ను పెంచ‌డం నా  ప్ర‌భుత్వ ధ్యేయం గా ఉంది.  మా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేసేందుకు మ‌రిన్ని నిర్మాణాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని మేం ఆశిస్తున్నాం.  ప్ర‌పంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల లో ఒక‌టిగా మేం నిలుస్తూ వ‌స్తున్నాం” అని స‌భికుల‌ కు ఆయ‌న వెల్లడించారు.

“స్టార్ట్‌-అప్ ల ప‌రం గా చూసిన‌ప్పుడు భార‌త‌దేశం ప్ర‌స్తుతం అతి పెద్ద ఇకో సిస్ట‌మ్స్ లో ఒక‌టి గా ఉంద‌ని, అంతేకాక‌ భార‌త‌దేశం లోని ప్ర‌పంచ శ్రేణి ప‌రిశోధ‌న స‌దుపాయాలు పెట్టుబ‌డి కి అనువైన వాతావ‌ర‌ణాన్ని అందిస్తున్నాయ‌’’ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  “మేం మా యువ‌త‌ కు ఉద్యోగాల‌ ను క‌ల్పించ‌డం కోసం త‌యారీ ని ప్రోత్స‌హించేందుకు క‌ఠోరం గా శ్ర‌మించాం.  మా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మం ద్వారా పెట్టిన పెట్టుబ‌డులకు ‘డిజిట‌ల్ ఇండియా’, ఇంకా ‘స్కిల్ ఇండియా’ ల వంటి కార్య‌క్ర‌మాలు చ‌క్క‌టి మ‌ద్ద‌తు ను ఇస్తున్నాయి” అని ఆయ‌న వివ‌రించారు.

“2017వ సంవ‌త్స‌రం లో ప్ర‌పంచం లో అత్యంత వృద్ధి ని న‌మోదు చేసిన ప‌ర్య‌టన సంబంధిత గ‌మ్య స్థానాల స‌ర‌స‌న మేం ఉన్నాం.  2016వ సంవ‌త్స‌రం తో పోల్చి చూస్తే భార‌త‌దేశం 14 శాతం వృద్ధి ని సాధించింది;  కాగా, అదే సంవ‌త్స‌రం లో ప్ర‌పంచం స‌గ‌టు న 7 శాతం మేర‌కు వృద్ధి ని సాధించింది.  ప్ర‌పంచం లో అత్యంత వేగం గా వ‌ర్ధిల్లుతున్న విమాన‌యాన విప‌ణి గా కూడా మేం నిల‌చాం.  నాలుగు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి లో ప్ర‌యాణికుల కు జారీ చేసిన టికెట్ల లో రెండంకెల వృద్ధి ఉంది’’ అని ఆయ‌న అన్నారు.  ‘‘ఈ విధం గా భార‌తదేశం బ్ర‌హ్మాండ‌మైన అవ‌కాశాల కు నిల‌యం గా ఉంది.  ప్ర‌జాస్వామ్యాన్ని, జ‌నాభా ప‌రంగా వయోవర్గ సానుకూల‌త‌ ను మ‌రియు డిమాండు ను మీకు అందించేటటువంటి ఏకైక ప్రాంతం ఇదే” అని ఆయ‌న విశ‌దీక‌రించారు.

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ ను గురించి ఆయ‌న చెప్తూ, “ఇది ప్ర‌స్తుతం ఒక ప్ర‌పంచ వేదిక గా ఆవిర్భ‌వించింది.  ఎంతో మంది నాయ‌కుల రాక‌ ను బ‌ట్టి చూస్తే అంత‌ర్జాతీయ స‌హ‌కారం అనేది ఇక జాతీయ రాజ‌ధాని న‌గ‌రాల‌ కు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని, రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రాల‌ కు కూడా అది ల‌భిస్తుంద‌ని తేలుతోంద‌’’న్నారు.

విధానాలు చోదక శక్తి గా ఉన్నటువంటి ప‌రిపాల‌న ను అందిస్తున్నందుకు మ‌రియు దార్శ‌నిక‌త తో కూడిన నాయ‌క‌త్వాన్ని అందిస్తున్నందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ ప్ర‌శంసించారు.  వ్యాపారాన్ని సుల‌భ‌త‌రం గా మార్చేందుకు సాధ్య‌మైన  అన్ని ర‌కాల మ‌ద్ద‌తు ను అందించడం జరుగుతుందని ప‌రిశ్ర‌మ సార‌థుల‌ కు ఆయ‌న హామీ ని ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారిలో ఉజ్ బెకిస్తాన్ అధ్య‌క్షులు శ్రీ శౌకత్ మిర్జియోయెవ్ తో పాటు డెన్మార్క్ ప్ర‌ధాని  శ్రీ లార్స్ లోకే రాస్ ముసెన్, చెక్ రిప‌బ్లిక్ ప్ర‌ధాని శ్రీ ఆంద్రెజ్ బాబిస్‌, ఇంకా మాల్టా ప్ర‌ధాని డాక్టర్ జోసెఫ్ మ‌స్క‌ట్ లు ఉన్నారు.  

ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ  వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఒక ప్ర‌త్యేక సందేశాన్ని ఇవ్వ‌డం వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ 2019 లో ఓ ప్ర‌ధానాక‌ర్ష‌ణ గా నిల‌చింది.  “మ‌న రెండు దేశాల ప్ర‌జ‌ల న‌డుమ గుజ‌రాత్ ఒక శ‌క్తివంత‌మైన సంధానానికి ప్ర‌తీక‌గా ఉంది.  మ‌నం ఉభయులం క‌ల‌సి భ‌విష్య‌త్తు కోసం ప‌రిమితి లేన‌టువంటి అవ‌కాశాల‌ ను ఆవిష్క‌రిస్తున్నాం” అని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ తన సందేశం లో  పేర్కొన్నారు.

మూడు రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల లో ప్ర‌ధానం గా చేప‌ట్టే కార్య‌క్ర‌మాల లో.. గ్లోబ‌ల్ ఫండ్ ల అధిప‌తుల తో ఒక రౌండ్ టేబుల్ స‌మావేశం, ‘ఆఫ్రికా డే’, ఎమ్ఎస్ఎమ్ఇ స‌మ్మేళనం, సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్ అండ్ మేథ‌మేటిక్స్ (ఎస్‌టిఇఎమ్‌) ఎడ్యుకేశ‌న్ & రిస‌ర్చ్ లో అవ‌కాశాల పై మ‌రొక రౌండ్ టేబుల్ స‌మావేశం వంటివి.. ఉన్నాయి.  వీటి కి తోడు భ‌విష్య‌త్తు కాల‌పు సాంకేతిక విజ్ఞానాలు, అంత‌రిక్ష అన్వేష‌ణ ల‌పై ప్ర‌ద‌ర్శ‌న‌, ఆసియా లో ట్రాన్స్‌శిప్‌మెంట్ హ‌బ్ గా భార‌త‌దేశాన్ని నిల‌బెట్టేందుకు నౌకాశ్ర‌యాల నేతృత్వం లో అభివృద్ధి మ‌రియు వ్యూహాలు అంశం పై ఒక చర్చా స‌భ మ‌రియు మేక్ ఇన్ ఇండియా విజ‌య గాథ‌ల‌ను క‌ళ్ళ‌కు క‌ట్టే ‘మేక్ ఇన్ ఇండియా’ అంశం పై సెమినార్ , ఇంకా ప్రభుత్వం చేపట్టిన కీలక చర్య లపై సెమినార్ ల‌ను కూడా ఏర్పాటు చేశారు.

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ తొలి సంచిక ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా ఉన్న కాలం లో 2003వ సంవ‌త్స‌రం లో నిర్వహించారు.  గుజ‌రాత్ లో పెట్టుబ‌డుల కు ఊతాన్ని ఇవ్వ‌డం ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధానోద్దేశం గా ఉంది.  ఇక అప్ప‌టి నుండి ఈ కార్య‌క్ర‌మం దేశం లోని ఇత‌ర రాష్ట్రాల లో ఏటా ఈ త‌ర‌హా శిఖ‌ర స‌మ్మేళ‌నాల‌ ను చేప‌ట్టేందుకు ఈ కార్యక్రమం ఒక ఉత్ప్రేర‌కం లాగా ప‌ని చేసింది.

**