పిఎంఇండియా
ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారతీయ భాషలన్నింటితో పాటు అనేక విదేశీ భాషల్లోకి అనువాదమైన ఆయన రచనలకున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ… ఈ దిగ్గజ రచయితను స్మరించుకున్నారు. 19వ శతాబ్దంలో భారతదేశాన్ని ముఖ్యంగా గ్రామీణ బెంగాలీ సమాజాన్ని కచ్చితమైన, సున్నితమైన రీతిలో శరత్చంద్ర ఛటోపాధ్యాయ రచనలు ప్రతిబింబిస్తాయన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని చేసిన పోస్టు:
ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్ చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా నివాళులు.
భారతీయ భాషలన్నింటితో పాటు అనేక విదేశీ భాషల్లోకి ఆయన రచనలు అనువాదమయ్యాయి. అవి 19వ శతాబ్దంలో భారతదేశాన్ని, ముఖ్యంగా గ్రామీణ బెంగాలీ సమాజాన్ని వాస్తవికంగా చిత్రించిన ఆయన రచనలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. సామాజిక సంస్కరణలు, మహిళా హక్కులు, జాతీయవాదం పట్ల ఆయనకున్న నిబద్ధత కూడా అంతే విశేషమైనది.
భవిష్యత్తులో ఆయన రచనలను చదవాలని యువతకు పిలుపునిస్తున్నాను.
Homage to noted Bengali writer, the versatile Saratchandra Chattopadhyay on his 150th birth anniversary.
— Narendra Modi (@narendramodi) September 15, 2026
His works, translated into every Indian language and several foreign languages, are remembered for their accurate depiction of 19th century India, especially Bengali society…