పిఎంఇండియా
శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. గొప్ప తాత్వికవేత్త, జాతీయవాది, కవి, ఆలోచనాపరుడైన శ్రీ అరబిందో భారతదేశ స్వాతంత్య్రం, మానవ పురోగతికి సంబంధించిన విస్తృత అన్వేషణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు.
వివిధ విషయాలపై ఆయన రాసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా తరతరాలను నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మన దేశ భవితవ్యంపై, మానవ పరివర్తన అపరిమిత అవకాశాలపై శ్రీ అరబిందోకు ఉన్న విశ్వాసం నేటికీ ఎంతో సముచితమైందిగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను.
గొప్ప తాత్వికవేత్త, జాతీయవాది, కవి, ఆలోచనాపరుడైన శ్రీ అరబిందో భారతదేశ స్వాతంత్య్రం, మానవ పురోగతికి సంబంధించిన విస్తృత అన్వేషణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వివిధ అంశాలపై ఆయన రాసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా తరతరాలను నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మన దేశ భవితవ్యంపై, మానవ పరివర్తనకు ఉన్న అపరిమిత అవకాశాలపై ఆయనకు ఉన్న విశ్వాసం నేటికీ ఎంతో సముచితమైందిగా నిలుస్తోంది.”
Remembering Sri Aurobindo on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) August 15, 2026
A towering philosopher, nationalist, poet and thinker, Sri Aurobindo dedicated his life to India’s freedom as well as to the larger quest for human progress. His works on various subjects continue to inspire generations across… pic.twitter.com/sEBTfCezMm
শ্রী অরবিন্দকে তাঁর জন্মবার্ষিকীতে স্মরণ করছি।
— Narendra Modi (@narendramodi) August 15, 2026
একজন বিশিষ্ট দার্শনিক, জাতীয়তাবাদী, কবি এবং চিন্তাবিদ, শ্রী অরবিন্দ তাঁর জীবনকে ভারতের স্বাধীনতার পাশাপাশি মানব অগ্রগতির বৃহত্তর অনুসন্ধানে উৎসর্গ করেছিলেন। বিভিন্ন বিষয়ে তাঁর কালজয়ী সৃষ্টি বিশ্বজুড়ে প্রজন্ম থেকে প্রজন্মকে… pic.twitter.com/K393Cu7qnI