Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ డీవై పాటిల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం


ప్రముఖ విద్యావేత్తసమాజ సేవకుడు శ్రీ డీవై పాటిల్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. డీవై పాటిల్ గారు ఎల్లప్పుడూ ఇతరులుముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేశారని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. 

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 ‘‘శ్రీ డీవై పాటిల్ విద్యా రంగంసేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు. ఆయన ఎల్లప్పుడూ ఇతరులుముఖ్యంగా పేదల జీవితాలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమించారు. పాటిల్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకుఅభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’.