Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ మోదీ నాయకత్వం, పరిపాలన విధానాలను వివరిస్తూ ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి శ్రీ నృపేంద్ర మిశ్రా వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


తన మాజీ ముఖ్య కార్యదర్శి శ్రీ నృపేంద్ర మిశ్రా రాసిన ఒక వ్యాసాన్ని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. 

ఈ వ్యాసంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆయన పనిచేసే విధానాల ద్వారా అర్థం చేసుకోవచ్చని శ్రీ నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. ముందస్తు సన్నద్ధత, నిర్ణయాత్మక చర్యలు, సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంపై శ్రీ మోదీకి ప్రత్యేక దృష్టి ఉంటుందని వివరించారు. ఈ విధానం ఆయన పాలన, ఫలితాలపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది. 

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆయన పని విధానం ద్వారా ఉత్తమంగా అర్థం చేసుకోవచ్చని ప్రధానమంత్రి మాజీ ముఖ్య కార్యదర్శిశ్రీ నృపేంద్ర మిశ్రా రాశారు. ముందస్తు సన్నద్ధత, పటిష్టమైన చర్యలు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంపై ఆయన దృష్టి.. పాలనలో అనుసరించే విధానాన్ని, సాధించిన ఫలితాలను ప్రభావితం చేసింది’’