Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ లంక లో భీషణ విస్ఫోటాలను ఖండించిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ లంక లో జరిగినటువంటి భయావహమైన పేలుళ్ళ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్రం గా ఖండించారు.

ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో ‘‘శ్రీ లంక లో జ‌రిగినటువంటి భీతి ని గొలిపే విస్ఫోటాల‌ ను తీవ్రం గా ఖండిస్తున్నాను. ఈ విధమైన బ‌ర్బ‌ర‌త్వాని కి మ‌న ప్రాంతం లో ఎటువంటి తావు లేదు. భార‌త‌దేశం శ్రీ లంక యొక్క పౌరుల వెన్నంటి నిలబడింది. ఆప్తుల‌ ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను; క్ష‌త‌గాత్రులు కోలుకోవాలంటూ ఆ ఈశ్వ‌రుడి ని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

**