Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సి.కె.జాఫర్ షరీఫ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం


శ్రీ సి.కె.జాఫర్ షరీఫ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘శ్రీ సి.కె.జాఫర్ షరీఫ్ మరణంతో నేను విషాదంలో మునిగాను. దిగ్గజ పార్లమెంటేరియన్ అయిన ఆయన, పార్లమెంటు కార్యకలాపాలను సుసంపన్నం చేశారు. కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించిన జాఫర్ షరీఫ్ ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఢిల్లీలో తన గళంద్వారా సమర్థంగా వినిపించేవారు.

సమున్నత పార్లమెంటేరియన్ జాఫర్ షరీఫ్ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.