Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

షికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగాన్ని స్మరించుకున్న ప్రధానమంత్రి


సెప్టెంబర్ 11, 1983న స్వామి వివేకానంద షికాగోలో చేసిన చరిత్రాత్మక ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు.

భారత నాగరికతా విలువలను ప్రతిబింబించేలా స్వామి వివేకానంద ఆకట్టుకునే ప్రసంగమిచ్చారని ప్రధానమంత్రి అన్నారు.

ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“షికాగోలో సెప్టెంబర్ 11, 1983న

భారత నాగరికత విలువలు కళ్లకు కట్టేలా స్వామి వివేకానంద అపూర్వమైన ప్రసంగం చేశారు.

ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి.

https://belurmath.org/swami-vivekananda-speeches-at-the-parliament-of-religions-chicago-1893/”

 

****