Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సత్యం, పట్టుదల విలువను తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని


అలుపెరగని కృషితో, సత్య మార్గంలో పయనించడం ద్వారా సాధించిన విజయం శాశ్వతమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా గొప్ప మానసిక సంతృప్తిని కూడా ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం–

‘‘న తథా బలవీర్యాభ్యాం జయంతి విజిగీషవః

యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేన చ’’
గెలవాలన్న కోరికతో ఉన్నవారు సామర్థ్యం, బలంతో మాత్రమే కాకుండా సత్యం, కరుణ, ధర్మం, నిరంతర కృషి ద్వారా కూడా విజయం సాధిస్తారని ఈ సుభాషితం తెలియజేస్తోంది.
ప్రధానమంత్రి ఎక్స్‌లో ఇలా రాశారు:
‘‘
అలుపెరగని శ్రమ, సత్య మార్గంలో నడవడం ద్వారా పొందే విజయం శాశ్వతంగా ఉంటుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, మనస్సుకు గొప్ప సంతృప్తి కూడా లభిస్తుంది
‘‘న తథా బలవీర్యాభ్యాం జయంతి విజిగీషవః

యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేన చ’’

 

***