Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంప్రదాయక వైద్య వ్యవస్థల రంగంలో సహకారం కోసం మయన్మార్ తో ఎమ్ ఒ యు కు మంత్రిమండలి ఆమోదం


సాంప్రదాయక వైద్య వ్యవస్థల రంగంలో సహకారం కోసం మయన్మార్ తో అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

మయన్మార్ లో ఎవైయుఎస్ హెచ్ (ఆయుష్)/ సాంప్రదాయక వైద్య వ్యవస్థల ఉన్నతి కోసం రెండు దేశాల మధ్య సహకారానికి ఒక వ్యవస్థాగత స్వరూపాన్ని ఈ ఎమ్ ఒ యు సమకూర్చుతుంది. ఈ ఎమ్ ఒ యు ఆయుష్ తరహా వైద్యం, సంరక్షణ, ఉత్పత్తి, ప్రమాణీకరణం ప్రక్రియలకు ఉన్న ప్రాముఖ్యాన్ని పెంచగలుగుతుంది.