Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తులు మ‌రియు హోమియోప‌తి రంగం లో స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు బొలీవియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తులు మ‌రియు హోమియోప‌తి రంగం లో స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు బొలీవియా కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం (ఎంఒయు )కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎంఒయు పై బొలీవియా లో 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల‌ లో సంత‌కాల‌య్యాయి.

ప్ర‌భావం:

ఈ ఎంఒయు సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తులు మ‌రియు హోమియోప‌తి రంగం లో ప్రోత్సాహాని కి ఒక ఫ్రేమ్ వర్క్ ను స‌మ‌కూర్చ‌ుతుంది. ఆ ఫ్రేమ్ వర్క్ ఉభయ దేశాల కు పరస్పరం ప్రయోజన కారి గా కూడా ఉంటుంది. ఇది సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధతులు, ఇంకా హోమియోప‌తి లు బొలీవియా లో ప్రచారం పొందేందుకు దారితీయ‌డ‌మే కాక ఆయుష్ (ఆయుర్వేద‌, యోగా, యునానీ, సిద్ధ‌, ఇంకా హోమియోప‌తి) ప‌ద్ధ‌తుల ప్రాముఖ్యాన్ని బొలీవియా లో వ‌ర్ధిల్లజేస్తుంది. ఈ ఎంఒయు ప్రాక్టిశన‌ర్ లకు శిక్ష‌ణ ను ఇవ్వ‌డం కోసం నిపుణుల రాక పోక‌ల కు మార్గాన్ని సుగమం చేస్తుంది; అలాగే, స‌మ‌న్వ‌యం తో కూడిన ప‌రిశోధ‌న ను చేప‌ట్టే శాస్త్రవేత్త ల‌కు కూడా మార్గాన్ని సుగమం చేస్తుంది. త‌ద్వారా సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తుల ను అనుస‌రించడం లో, ఇంకా ఔష‌ధాల అభివృద్ధిలో నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌కు దారితీస్తుంది.

******