Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఇవో ఫోరమ్ సమావేశానికి హాజరైన భారత, బ్రిటన్ ప్రధానులు

సిఇవో ఫోరమ్  సమావేశానికి హాజరైన భారత, బ్రిటన్ ప్రధానులు

సిఇవో ఫోరమ్  సమావేశానికి హాజరైన భారత, బ్రిటన్ ప్రధానులు

సిఇవో ఫోరమ్  సమావేశానికి హాజరైన భారత, బ్రిటన్ ప్రధానులు


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని శ్రీ డేవిడ్ కామెరాన్ తో కలసి బ్రిటన్-ఇండియా సిఇవో ఫోరమ్ సమావేశానికి హాజరయ్యారు.

తన ఉపన్యాసం ప్రారంభంలోనే ప్రధాని శ్రీ కామెరాన్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టిని ప్రశంసించారు. భారతదేశ అభివృద్ధికోసం ప్రధాని చేస్తున్న కృషిని పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య చరిత్రాత్మక బంధాలను, ప్రశంసనీయ అంశాలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్థికపరమైన బంధాలు ఇరుదేశాల మద్య బంధంలో ప్రధానమైన అంశాలని ప్రధాని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజాప్రయోజన కార్యక్రమాల గురించి తన ప్రసంగంలో వివరించారు. ముఖ్యంగా ఇండియాలోనే తయారీ, మౌలిక రంగానికి ప్రాధాన్యత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం, 2022నాటికి యాభై మిలియన్ గృహాల నిర్మాణం, 175 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి తదితర అంశాలపై ప్రధాని సవివరంగా మాట్లాడారు. ఇండియాలో బ్రిటన్ కంపెనీల పెట్టుబడుల కారణంగా ఇరు దేశాలు లబ్ధి పొందుతాయని స్పష్టం చేశారు.

ఇరు దేశాలకు చెందిన సిఇవోలు సంక్షిప్తంగా తమ స్పందనల్ని తెలియజేశారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారస్తుల ముందు ప్రస్తుతం భారతదేశంలో అద్భుతమైన అవకాశాలున్నాయని దాదాపుగా సమావేశంలో పాల్గొన్నవారందరూ అంగీకరించారు.