పిఎంఇండియా
యువర్ ఎక్స్‌లెన్సీ, డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ,
ఇరు దేశాల ప్రముఖ ప్రతినిధులు,
ప్రసార మాధ్యమాల మిత్రులారా,
నమస్కారం.
అధ్యక్షుడు శ్రీ హెర్మినీకీ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.
సీషెల్స్ అధ్యక్షునిగా ఎన్నికవడం పట్ల, 140 కోట్ల మంది భారతీయుల పక్షాన నేను ఆయనకు మనసారా అభినందనలనీ, శుభాకాంక్షలనీ తెలియజేస్తున్నాను.
అధ్యక్షుడు భారత్‌కు రావడం ఇదే మొదటి సారి. సీషెల్స్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆయన భారత్ పర్యటన చోటుచేసుకొంటోంది. ఈ కీలక ఘట్టాలు కలిసికట్టుగా కొత్త శిఖరాలకు చేరుకోవడానికి మనకు స్ఫూర్తిని అందిస్తుంటాయని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
భారత్, సీషెల్స్ సంబంధాలు దౌత్య సంబంధాల కన్నా విస్తృతమైనవి. హిందూ మహాసముద్రం అలలు మన ప్రజల్ని కొన్ని వందల ఏళ్లుగా సంధానిస్తున్నాయి. ఈ సముద్ర తీరం వెంబడి, మన దేశాల మధ్య వాణిజ్యం విస్తరించింది, సంస్కృతులు పెనవేసుకొనిపోయాయి, విశ్వాసం అంతకంతకూ బలోపేతమవుతూనే ఉంది.
భారత్, సీషెల్స్ ఒక్క భౌగోళికంగానే కాకుండా చరిత్ర, నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృష్టికోణం ద్వారా కూడా అనుబంధితమై ఉన్నాయి.
మన బంధం గతకాలం, వర్తమానంతో పాటు భవిష్యత్కాలానికీ వర్తించేదే. నౌకావాణిజ్య పొరుగుదేశంగా, విశ్వసనీయ భాగస్వామ్య దేశంగా భారత్ అనుసరిస్తున్న ‘మహాసాగర్’ దార్శనికతలో సీషెల్స్ ఒక అంతర్భాగంగా ఉంది. నౌకా వాణిజ్యంతో పాటు భూ, వాయు రంగాలకు కూడా విస్తరించింది మన సహకారం.
ఈ భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకొనే మార్గాన్ని ఇవాళ్టి చర్చల్లో మనం కనుగొన్నాం. మన ఆర్థిక సహకారాన్ని పటిష్ఠపరుచుకోవడానికి కొత్త కొత్త అవకాశాల్ని అన్వేషించాలని ఓ అంగీకారానికి వచ్చాం.
Addressing the joint press meet with President Dr. Patrick Herminie of the Republic of Seychelles.
— Narendra Modi (@narendramodi) February 9, 2026
https://t.co/gKZQcH960T
भारत और सेशेल्स के संबंध केवल राजनयिक संपर्क तक सीमित नहीं है।
— PMO India (@PMOIndia) February 9, 2026
हिंद महासागर की लहरें सदियों से हमारे लोगों को जोड़ती आई हैं।
इसके तटों पर दोनों देशों के बीच व्यापार बढ़ा, संस्कृतियाँ मिलीं और विश्वास की परंपराएँ मजबूत होती गईं: PM @narendramodi
India and Seychelles are connected not just by geography, but by history, trust and a shared vision for the future: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 9, 2026
विकास साझेदारी भारत-सेशेल्स संबंधों की मजबूत नींव रही है।
— PMO India (@PMOIndia) February 9, 2026
हमारे सभी प्रयास सेशेल्स की प्राथमिकताओं और आवश्यकताओं पर आधारित रहे हैं।
इस दिशा में आगे बढ़ते हुए आज हम 175 मिलियन डॉलर के Special Economic Package की घोषणा करने जा रहे हैं।
यह पैकेज social housing, e-mobility,…
भारत–सेशेल्स संबंधों की सबसे बड़ी शक्ति हमारे people-to-people ties हैं।
— PMO India (@PMOIndia) February 9, 2026
सेशेल्स में बसे भारतीय समुदाय ने सेशेल्स के सामाजिक और आर्थिक जीवन में उल्लेखनीय योगदान दिया है।
साथ साथ उन्होंने हमारी मित्रता को पीढ़ी दर पीढ़ी मजबूत भी किया है: PM @narendramodi