Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుక్మా లో జ‌రిగిన దాడిలో అమరులైన సిఆర్‌పిఎఫ్ సాహ‌సిక సిబ్బందికి ప్రణామం చేసిన ప్ర‌ధాన మంత్రి


ఛత్తీస్‌ గ‌ఢ్ లోని సుక్మా లో జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌ లో అమ‌రులైన సాహ‌సిక సిఆర్‌పిఎఫ్ సిబ్బందికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ణ‌మిల్లారు.

‘‘ఛత్తీస్‌ గ‌ఢ్ లోని సుక్మా లో జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో ఆత్మబలిదానం చేసిన సిఆర్‌పిఎఫ్ కు చెందిన సాహ‌సిక సిబ్బందికి భార‌త‌దేశం న‌మ‌స్క‌రిస్తోంది. అమ‌ర వీరుల కుటుంబ సభ్యులకు మ‌రియు మిత్రులకు క‌లిగిన దుఃఖంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ బాధాతప్త స‌మ‌యం లో దేశ ప్ర‌జ‌లు వారి వెన్నంటి నిలుస్తున్నారు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***