పిఎంఇండియా
గుజరాత్‌లోని సూరత్, కేంద్రపాలిత ప్రాంతమైన దమన్‌లో తన ఇటీవలి పర్యటనలకు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. సూరత్ ప్రజల మధ్య గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. చైతన్యవంతమైన ఆ నగరం నుంచి భారత్‌ను మరింత బలంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దేందుకు దేశమంతా ఏకతాటిపై వచ్చి తన సంకల్పాన్ని చాటిచెప్పిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
దమన్‌లో ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనులు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలకు సంబంధించిన కీలక విశేషాలు, దృశ్యాలను ఆయన పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పలు పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘నిన్న సూరత్ ప్రజల మధ్య గడపడం ఎంతో అద్భుతంగా అనిపించింది. చైతన్యవంతమైన ఈ నగరం నుంచి భారత్‌ను బలంగా, స్వయంసమృద్ధంగా మార్చాలనే నిబద్దతను మనమందరం సమష్టిగా పునరుద్ఘాటించాం’’.
‘‘నిన్న దమన్‌లో ప్రారంభించిన అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి. నిన్నటి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ పంచుకుంటున్నాను..’’
***
It was wonderful being among the people of Surat yesterday. From this vibrant city, we collectively reiterated our commitment to making India strong and self-reliant. pic.twitter.com/VtE67tYj02
— Narendra Modi (@narendramodi) June 6, 2026
The development works inaugurated yesterday will substantially improve people's lives in Daman. Here are some highlights from the programmes yesterday... pic.twitter.com/Zrjkylk3ID
— Narendra Modi (@narendramodi) June 6, 2026