Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సూరత్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


సూరత్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన లో బాధితులకు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించవలసిందిగా గుజరాత్ ప్రభుత్వానికి మరియు స్థానిక అధికారుల కు ఆయన సూచించారు.

‘‘సూరత్ లో అగ్ని ప్రమాదం సంభవించడం అత్యంత బాధాకరం. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. ఈ ప్రమాదం లో గాయపడిన వారు శీఘ్రం గా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితుల కు సాధ్యమైన అన్ని రకాలుగాను సహాయాన్ని అందించవలసిందని గుజరాత్ ప్రభుత్వాన్ని, స్థానిక సంస్థల అధికార యంత్రాంగాన్ని కోరాను’’ అని ఒక సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

**