Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెంట్రల్ అమ్యూనిషన్ డిపో లో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టం జరగడం పట్ల దు:ఖం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మహారాష్ట్ర లోని పుల్ గాఁవ్ లో ఉన్న సెంట్రల్ అమ్యూనిషన్ డిపో లో అగ్నిప్రమాదం సంభవించి, ప్రాణనష్టం జరగడం పట్ల దు:ఖం వ్యక్తం చేశారు.

“మహారాష్ట్ర లోని పుల్ గాఁవ్ లో ఉన్న సెంట్రల్ అమ్యూనిషన్ డిపో లో అగ్నిప్రమాదం సంభవించి, ప్రాణనష్టం జరిగినందుకు చింతిస్తున్నాను. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధను నేను కూడా పంచుకొంటున్నాను.

గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రక్షణ శాఖ మంత్రి శ్రీ మనోహర్ పర్రీకర్ ను ప్రమాద స్థలానికి తరలి వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించవలసిందని కోరాను” అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.

***