పిఎంఇండియా
సేవా తీర్థ్‌కు మారిన తరువాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న తొలి నిర్ణయాల్లో సేవా స్ఫూర్తి ఉట్టిపడింది.. ఆయన సంతకాలు చేసిన ముఖ్య దస్త్రాలలో సమాజంలో ప్రతి ఒక్క వర్గానికీ సంబంధించినవి ఉన్నాయి. ఆ వర్గాల్లో ప్రధానంగా రైతులు, మహిళలు, యువతీయువకులతో పాటు బలహీన వర్గాల పౌరులు ఉన్నారు.
1. పీఎమ్ రాహత్ పథకం: దేశ పౌరులలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన ప్రాణ రక్షక కవచం.
పీఎమ్ రాహత్ పథకాన్ని మొదలుపెట్టడానికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రమాద బాధితులు రూ.1.5 లక్షల వరకూ నగదు రహిత చికిత్సను పొందగలుగుతారు. దీంతో, సత్వర వైద్య సహాయం లోపించినందువల్ల ఏ ఒక్కరూ ప్రాణం కోల్పోయే అగత్యం ఏర్పడకుండా సాయపడడమే ఈ పథకం లక్ష్యం.
2. లఖ్‌పతీ దీదీల లక్ష్యాన్ని రెట్టింపు చేసి 6 కోట్లకు చేర్చారు
ప్రభుత్వం 2027 మార్చి నెల నాటికి నిర్దేశించుకున్న 3 కోట్ల మంది సోదరిలను లఖ్‌పతీ దీదీ (లక్షాధికారి సోదరి)లుగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్న చరిత్రాత్మక గణాంకాన్ని అంతకు ఒక ఏడాది కన్నా ఎక్కువ సమయం ముందే అధిగమించింది.
ప్రధానమంత్రి ఇప్పుడు ఒక కొత్త, ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు.. దీన్లో భాగంగా, 2029 మార్చి నెల కల్లా 6 కోట్ల మందిని లఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. దీంతో పథకం పరిమాణాన్నీ, అభిలాషనీ రెండింతలు చేసినట్లయింది.
3. రైతులకు భారీ నూతనోత్తేజం: వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి రుణ లక్ష్యాన్ని రెట్టింపు చేసి రూ.2 లక్షల కోట్లకు చేర్చారు.
భారత్‌లో వ్యవసాయ రంగంలో వేల్యూ చైనును సమగ్రంగా బలోపేతం చేసే ఉద్దేశంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి నుంచి రుణాలు మంజూరు లక్ష్యాన్ని రెట్టింపు చేసి, రూ.1 లక్ష కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
4. రూ.10,000 కోట్ల మూలనిధితో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ 2.0’.. నూతన అన్వేషణల రంగంలో ఓ సరికొత్త మేలిమలుపు
భారత్‌లో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థకు కొత్త శక్తిని అందించడానికి.. ప్రత్యేకించి డీప్ టెక్‌కీ, ఆరంభ దశ ఆలోచనలకీ (అర్లీ స్టేజ్ ఐడియాస్), పురోగామి తయారీ రంగానికీ, బ్రేక్‌త్రూ టెక్నాలజీ రంగానికీ ఉద్దేశించిన రూ.10,000 కోట్ల మూలనిధి (కార్పస్)తో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఓఎఫ్) 2.0’ను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు.
***
At Seva Teerth earlier today, signed files that are connected with the empowerment of the poor, downtrodden, our hardworking farmers, Yuva Shakti and Nari Shakti. The key decisions include:
— Narendra Modi (@narendramodi) February 13, 2026
Approval for the launch of PM RAHAT scheme, as per which victims of accidents will get… pic.twitter.com/dVn5LyrVNX
With an unwavering resolve to serve the people of India and guided by the sacred spirit of Nagrikdevo Bhava, Seva Teerth is humbly dedicated to the nation.
— Narendra Modi (@narendramodi) February 13, 2026
May Seva Teerth always stand as a radiant symbol of duty, compassion, commitment to the principle of India First. May it… pic.twitter.com/xVRoEcbtE9
देशवासियों की सेवा के अटूट संकल्प और 'नागरिक देवो भव' की पावन भावना को साथ लेकर, आज ‘सेवा तीर्थ’ को राष्ट्र को समर्पित करने का सौभाग्य मिला।
— Narendra Modi (@narendramodi) February 13, 2026
‘सेवा तीर्थ’ कर्तव्य, करुणा और ‘राष्ट्र प्रथम’ के लिए हमारी प्रतिबद्धता का सशक्त प्रतीक है।
मेरी कामना है कि यह आने वाली पीढ़ियों को… pic.twitter.com/YWYUuSHtsD