Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు


ఎంఓయూ/ ఒప్పందాలు:

1

ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం

2

భారత్‌కు చెందిన సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్, సైప్రస్ దౌత్య అకాడమీ మధ్య దౌత్య శిక్షణ రంగంలో అవగాహన ఒప్పందం

3

ఆవిష్కరణలు, సాంకేతిక రంగంలో సైప్రస్ పరిశోధన– ఆవిష్కరణలు – డిజిటల్ విధానాల డిప్యూటీ మంత్రిత్వ శాఖ, భారత ఎలక్ట్రానిక్స్ – ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) మధ్య అవగాహన ఒప్పందం

4

గాలింపు, సహాయక చర్యలకు (ఎస్ఏఆర్) సంబంధించిన విషయాల్లో అధికారిక సమన్వయం, సహకారాన్ని పెంపొందించుకోవడానికి సైప్రస్‌కు చెందిన ‘లార్నాకా జాయింట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‘, భారత రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య సాంకేతిక సమన్వయ ఒప్పందం

5

ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత విద్యా మంత్రిత్వ శాఖ, సైప్రస్ ప్రభుత్వ విద్యా– క్రీడలు – యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

6

2026-2030 సంవత్సరాలకు గానూ సాంస్కృతిక సహకారం కోసం భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సైప్రస్ సాంస్కృతిక వ్యవహారాల డిప్యూటీ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

వరుస సంఖ్య ఎంఓయూ/ఒప్పందాలు

 

ప్రకటనలు:

వరుస సంఖ్య

విషయం

1

ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం‘ స్థాయికి తీసుకెళ్లటం

2

భారత్, సైప్రస్ మధ్య 2026-2031 సంవత్సరాలకు గానూ రక్షణ సహకార రోడ్ మ్యాప్

3

భారత్, సైప్రస్ మధ్య ‘సైబర్ సెక్యూరిటీ డైలాగ్‘ ఏర్పాటు

4

భారత్, సైప్రస్ మధ్య ‘కౌన్సిలర్ డైలాగ్‘ ఏర్పాటు

5

వ్యాపారం, అనుసంధానత, సముద్ర రవాణా విభాగం పరిధిలో ఇండో–పసిఫిక్ మహాసముద్రాల చొరవ‌లో (ఐపీఓఐ) సైప్రస్ చేరడం

6

సైప్రస్ దేశానికి ‘భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత – మైత్రి‘ (భీష్మ్) క్యూబ్‌ను బహుమతిగా అందజేయడం

7

2026 మే 18న చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ‘భారత్–సైప్రస్ అంతరిక్ష దినోత్సవం‘ నిర్వహణ

8

ముంబయిలో ‘సైప్రస్ వాణిజ్య కేంద్రం‘ ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని సైప్రస్ ప్రతినిధులు ప్రకటించడం

****