పిఎంఇండియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య సైబర్ రంగంతోపాటు కీలక సాంకేతిక పరిజ్ఞానాలలో ఒక శాశ్వత భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సైబర్-తదాధారిత కీలక సాంకేతిక సహకారం చట్రంపై 2020 నాటి ఒప్పందం సహా రెండు దశాబ్దాల సంయుక్త పరిశోధన, కార్యాచరణ సమన్వయం, విధానపరమైన భాగస్వామ్యాల ప్రాతిపదికన తాజా ఒప్పందం ఖరారైంది.
దేశ ఆర్థిక వృద్ధికి చోదక శక్తులైన సరఫరా వ్యవస్థలు, కీలక సాంకేతికతలు, సైబర్ భద్రత రంగాలు జాతీయ భద్రతలోనూ కీలకమని రెండు దేశాలూ గుర్తించాయి. దీంతోపాటు విలువలు, ప్రపంచ ప్రమాణాల రూపకల్పనకు అవి తోడ్పడతాయని గ్రహించాయి. ఈ నేపథ్యంలో స్నేహ సంబంధాల పునాది ఆధారంగా ‘‘సైబర్, కీలక సాంకేతికతలు-సరఫరా వ్యవస్థల భాగస్వామ్యం” (పీఏసీటీఎస్-ప్యాక్ట్స్) కింద 2020 నాటి చట్రం స్థానంలో ద్వైపాక్షిక ప్రయోజనాలను తాజా ఒప్పందం ద్వారా మరింత ఉన్నతీకరించాలని సంకల్పించాయి.
జాతీయ-ప్రాంతీయ భద్రతలో ఉమ్మడి ప్రయోజనాలకు మద్దతు, భాగస్వాములకు మరిన్ని డిజిటల్ సదుపాయాల సౌలభ్యం, కీలక సరఫరా వ్యవస్థలకు పునరుత్థాన సామర్థ్యం కల్పన, ప్రపంచ సైబర్ భద్రత పునరుత్థాన సామర్థ్యం పెంపు తదితరాలకు ‘ప్యాక్ట్స్’ మద్దతిస్తుంది. ఈ భాగస్వామ్యం కింద ఉభయ దేశాల కృషిలోని ప్రతి దశలోనూ భద్రత, రక్షణ, పునరుత్థాన సామర్థ్యం, సార్వజనీనత, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలకు సముచిత స్థానం ఉంటుంది. తద్వారా బాధ్యతాయుత సాంకేతిక అగ్రగాములుగా కొనసాగడంపై రెండు దేశాల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఒక సమగ్ర ఏకీకృత వ్యూహాత్మక దృష్టి కింద ఈ కృషి క్రమబద్ధీకరణ ద్వారా 5 సహకార మూలస్తంభాల ద్వారా లక్షిత కార్యకలాపాల నిర్వహణకు వీలు కలుగుతుంది.
సహకార మూలస్తంభాలు
పరస్పరం ముడిపడిన ప్రతి మూలస్తంభం కింద ప్రైవేట్ రంగం, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల మధ్య సహకారానికి మద్దతుపై అందుబాటులోగల అవకాశాలను, నిర్దిష్ట ప్రాజెక్టులను భారత్-ఆస్ట్రేలియా గుర్తిస్తాయి. దీంతో ప్రభుత్వాల మధ్య సహకార విస్తృతి సహా నవ్య సాంకేతికతలలో రెండువైపులా పెట్టుబడులు పెరుగుతాయి. మరోవైపు మేధా సంపత్తిని ఆర్థిక వృద్ధికి దోహదం చేసే ఉత్పత్తులుగా మార్చడంలో మద్దతిస్తుంది.
మూలస్తంభం 1: సరఫరా వ్యవస్థల పటిష్టీకరణ.. వైవిధ్యీకరణ
రెండు దేశాల్లో విస్తరిస్తున్న సాంకేతిక పరిశ్రమలకు చేయూతనిస్తూ సురక్షిత, పటిష్ట, విశ్వసనీయ సరఫరా వ్యవస్థల కోసం ఆస్ట్రేలియా-భారత్ సంయుక్తంగా కృషి చేస్తాయి. భద్రత, రక్షణ ప్రక్రియల రూపకల్పనకు ప్రోత్సాహం, రక్షణాత్మక నియంత్రణ చట్రాల ఏర్పాటు, నియమాధారిత ద్వైపాక్షిక సాంకేతిక వాణిజ్యం-సరఫరా శ్రేణుల మరింత బలోపేతం వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి.
మూలస్తంభం 2: కీలక సాంకేతిక పరిజ్ఞానాలు
ప్రాధాన్యంగల కీలక సాంకేతికతల భద్రత, పునరుత్థాన సామర్థ్యం, సమగ్రతల బలోపేతం సహా కృత్రిమ మేధ (ఏఐ), అంతరిక్ష సాంకేతికతలు, టెలికమ్యూనికేషన్లు, బయోటెక్నాలజీ, అత్యాధునిక మూలకాలు వంటి కీలక రంగాల్లో నవ్య సాంకేతిక ఆవిష్కరణ దిశగా రెండు దేశాలూ సంయుక్తంగ కృషి చేస్తాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, ప్రాంతీయ స్థిరత్వానికి తోడ్పాటుగా అవసరమైన డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల పరిరక్షణ, ఆవిష్కరణలు-పరిశోధనల వేగం పెంపు, పరస్పర సంధానంతో ఏకాభిప్రాయ సహిత అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పనకు కృషి చేస్తాయి.
మూలస్తంభం 3: సైబర్ భద్రత
సైబర్, డిజిటల్ రంగాల రక్షణ-భద్రతల బలోపేతానికి భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా కృషి చేస్తాయి. సైబర్ నేరాల నియంత్రణ, హానికర సైబర్ కార్యకలాపాల నిరోధం ఇందులో భాగంగా ఉంటాయి. ఈ క్రమంలో సైబర్, సాంకేతిక భద్రత ప్రమాణాల సంబంధిత విజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడం సహా కీలక జాతీయ మౌలిక సదుపాయాల రక్షణకు ప్రాధాన్యమిస్తాయి.
మూలస్తంభం 4: డిజిటల్ పునరుత్థానం
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డిజిటల్ రూపం సంతరించుకుంటున్న ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా విశ్వసనీయ, విస్తరణీయ సాంకేతిక పరిష్కారాలు చూపడంలో భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా కృషి చేస్తాయి. అలాగే, ప్రాంతీయ సామర్థ్యాలను బలోపేతం చేయగల నిర్దిష్ట ప్రాజెక్టులను గుర్తించి, ప్రగతి సంబంధిత సమస్యల పరిష్కారానికి కలసి ముందడుగు వేస్తాయి.
మూలస్తంభం 5: రక్షణరంగ పరిశోధనలో సహకారం
రక్షణ రంగంలో వివిధ సవాళ్లు-సామర్థ్యాలపై ఉమ్మడి అవగాహన పెంపు దిశగా రక్షణ పరిశోధన భాగస్వామ్యాలను రెండు దేశాలూ సద్వినియోగం చేసుకుంటాయి. మునుపటి ఉమ్మడి పరిశోధనల ఆధారంగా పరస్పర ప్రయోజనానుగుణ భవిష్యత్తు ప్రాజెక్టులను రూపొందిస్తాయి. రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందం (MoU)లోని ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహకార నిబంధనల మేరకు రక్షణ శాస్త్రవిజ్ఞాన సంస్థల మధ్య ఆదానప్రదానాన్ని ముమ్మరం చేస్తాయి.
· రక్షణ అనువర్తనాల కోసం (సముద్ర నిఘా, ఆధునిక పదార్థాలు సహా) వినూత్న సముద్ర శాస్త్ర విజ్ఞాన-సాంకేతిక సామర్థ్యాలపై సహకారాత్మక కృషిని కేంద్రీకరిస్తాయి.
స్వరూపం… పరిపాలన: ద్వైపాక్షిక పర్యవేక్షణ
ఈ భాగస్వామ్యానికి ఉన్నత స్థాయిలో- ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కేబినెట్ డిప్యూటీ సెక్రటరీ (ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్), భారత డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్ఎస్ఏ) అధ్యక్షత వహిస్తారు. సైబర్, కీలక సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజన సహకారానికిగల ప్రాథమ్యాలను వారు గుర్తిస్తారు.
ఉన్నతాధికారుల (వార్షిక) సమావేశం: ప్రతి మూలస్తంభం పరిధిలోని ఉన్నతాధికారులు తమతమ బాధ్యతలకు సంబంధించి సమన్వయం చేసుకుంటారు. తద్వారా అధ్యక్ష పీఠానికి నివేదికలు సమర్పిస్తూ ప్రాథమ్యాలను సమీక్షిస్తారు. ఎప్పటికప్పుడు ప్రగతిని అంచనా వేస్తూ సైబర్, కీలక సాంకేతిక రంగాలలో కొత్త సమస్యలు-ముప్పులను విశ్లేషించి, ప్రతి మూలస్తంభం కింద నిర్దిష్ట ప్రాజెక్టులను గుర్తిస్తారు.
|
1 |
సరఫరా వ్యవస్థ పునరుత్థానం |
జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్ఎస్సీఎస్) |
సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయ సమన్వయం |
|
2 |
కీలక సాంకేతికతలు |
జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్ఎస్సీఎస్) |
సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయం |
|
3 |
సైబర్ భద్రత |
సైబర్ దౌత్య విభాగం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ |
సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయం |
|
4 |
డిజిటల్ పునరుత్థానం |
ఓషియానియా విభాగం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ |
సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయం |
|
5 |
రక్షణ పరిశోధన-సహకారం |
రక్షణ మంత్రిత్వశాఖ |
రక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ |
మూలస్తంభం | భారత్ ప్రతినిధి | ఆస్ట్రేలియా ప్రతినిధి |
|---|
***