Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్టాక్ ఎక్స్ ఛేంజ్ లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 5 శాతం నుండి 15 శాతానికి పెంచిన మంత్రిమండలి


భారతీయ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లలో విదేశీ షేర్ హోల్డింగ్ పరిమితిని 5 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. అంతే కాకుండా, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్ వెస్టర్లు సెకండరీ మార్కెట్ కు తోడు ఆరంభిక కేటాయింపు ద్వారా షేర్లను స్టాక్ ఎక్స్ ఛేంజీలలో నుండి కొనుగోలు చేయడానికి వారికి అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని, ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను భారతీయ స్టాక్ ఎక్స్ ఛేంజీలు అనుసరించే ప్రక్రియను ఈ చర్య సులభం చేయడం/వేగవంతం చేయడం ద్వారా మన దేశ స్టాక్ ఎక్స్ ఛేంజీలు అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచుకోవడానికి తోడ్పడగలదు. తత్ఫలితంగా మొత్తంమీద భారతీయ కేపిటల్ మార్కెట్ వృద్ధి చెంది, ముందడుగు వేయగలుగుతుంది.

ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2016-17 కేంద్ర బడ్జెటు ను సమర్పిస్తున్న సందర్భంలో భారతీయ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లలో ఫారిన్ ఎన్ టిటి ల పెట్టుబడుల పరిమితిని దేశీయ సంస్థలతో సమానంగా 5 శాతం నుండి 15 శాతానికి పెంచడానికి సంబంధించి ఎఫ్ డి ఐ విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు చేసిన ప్రకటనను అమలు లోకి తీసుకురావడంలో భాగంగానే ఈ ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది.

*****