పిఎంఇండియా
దేశానికి సేవ చేయడానికి వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసే వారిదే నిస్వార్థమూ, అంకిత భావమూ అని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భస్మీకృతస్వార్థసౌఖ్యపరిచర్చితవిగ్రహాః
స్వరాజ్యయోగనిర్మగ్నా ధన్యాస్తే వీరయోగినః’’ అని పేర్కొన్నారు.
‘స్వీయ సుఖాలను త్యాగం చేసి, సంపూర్ణ అస్తిత్వాన్ని స్వరాజ్య సాధనకే అంకితం చేసిన వారే నిజమైన వీరులు’’ అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
***
भस्मीकृतस्वार्थसौख्यपरिचर्चितविग्रहाः। स्वराज्ययोगनिर्मग्ना धन्यास्ते वीरयोगिनः॥ https://t.co/l8p6WVHaHk
— Narendra Modi (@narendramodi) October 8, 2026