పిఎంఇండియా
కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ తొలి బ్యాచ్ యాత్రికులకు జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్ లోని గురుదాస్‌పూర్ లో కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ వద్ద తొలి బ్యాచ్ యాత్రను చెక్ పోస్ట్ వద్ద జెండా ఊపిప్రారంభించారు. అలాగే సమీకృత చెక్ పోస్టును ప్రారంభించారు.
గురునానక్ దేవ్‌జీ జీవితంపై రూపొందించిన డిజిటల్ కార్యక్రమాన్ని ప్రధాని వీక్షించారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించడానికి ముందు ప్రధాని పాసింజర్ భవనాన్ని సందర్శించారు. తిరిగి వెళ్లడానికి ముందు ప్రధానమంత్రి తొలిబ్యాచ్ యాత్రికులతో ముచ్చటించారు.
సమీకృత చెక్ పోస్టు, కర్తార్ పూర్ కారిడార్
పాకిస్తాన్‌లోని గురుద్వారా కర్తార్ పూర్ సాహిబ్ ను సందర్శించడానికి భారతీయ యాత్రికులకు ఈ సమీకృత చెక్ పోస్టు వీలు కల్పిస్తుంది. డేరాబాబానానక్, అంతర్జాతీయ సరిహద్దు జీరోపాయింట్ వద్ద కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను కార్యరూపంలోకితెచ్చేందుకు 2019 అక్టోబర్ 24న ఇండియా పాకిస్థాన్‌తో ఒప్పందం పై సంతకాలు చేసింది.
కేంద్ర కేబినెట్ 2018 నవంబర్ 22న ఒక తీర్మానం చేస్తూ, చరిత్రాత్మకమైన శ్రీ గురునానక్ దేవ్ జీ 550 వ జయంతిని అత్యంత ఘనంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
సులభంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏడాది పొడవునా ఇండియా నుంచి యాత్రికులు గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్‌ను సందర్శించేందుకు దేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కర్తార్పూర్సాహిబ్ కారిడార్ నిర్మాణం అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యాత్రికులకు తగిన సదుపాయాలను కల్పించడం జరిగింది.
అమృతసర్- గురుదాస్ పూర్ హైవే నుంచి దేరాబాబా నానక్ ను అనుసంధానం చేస్తూ 4.2 కిలోమీటర్ల నాలుగులైన్ల జాతీయ రహదారిని 120 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది.
అత్యధునాతన పాసింజర్ టెర్మినల్‌ను 15 ఎకరాల స్థలంలో నిర్మించడం జరిగింది. పూర్తిగా ఎయిర్ కండిషనింగ్ చేసిన ఈ పాసింజర్ టెర్మినల్ ఎయిర్ పోర్టును తలపిస్తుంది.ఇందులో రోజుకు 5 వేల మంది ప్రయాణానికి వీలు కల్పించే 50 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి.
కియోస్క్‌లు, వాష్‌రూమ్‌లు, చిన్నపిల్లల సంరక్షణకు గదులు, ప్రథమచికిత్స సదుపాయాలు, ప్రార్థనా గది, చిరుతిళ్ల కౌంటర్ ఈ ప్రధాన భవనం లో ఏర్పాటు చేశారు.
ఈ ప్రాంగణంలో గట్టి భద్రతా చర్యలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సిసిటివి నిఘా, మైక్ ద్వారా సమాచారం అందించే ఏర్పాటు ఉ న్నాయి. అంతర్జాతీయ సరిహద్దువద్ద 300 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అక్టోబర్ 24న పాకిస్థౄన్ తో సంతకాలు చేసిన ఒప్పందం కర్తార్పూర్సాహిబ్ కారిడార్ కార్యరూపం దాల్చడానికి సంబందించి ఒక ఫ్రేమ్ వర్క్‌కు వీలు కల్పిస్తుంది.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు…
– అన్ని విశ్వాసాలకు సంబంధించిన భారతీయ యాత్రికులు ఈ కారిడార్ ను వినియోగించుకోవచ్చు.
– వీసా అవసరం లేకుండా ప్రయాణం
-యాత్రికులు కేవలం చెల్లుబాటు అయ్యే పాస్ పోర్టు కలిగి ఉండాలి.
– భారతీయ సంతతికి (పిఐఒ)చెందిన వ్యక్తులు ఓసిఐ కార్డును , తమ దేశ పాస్ పోర్టును కలిగి ఉండాలి
-ఉదయం నుంచి సాయంత్రం వరకు కారిడార్ తెరిచిఉంటుంది. ఉదయం పూట ప్రయాణించే యాత్రికులు అదేరోజు సాయంత్రానికి తిరిగిరావలసి ఉంటుంది.
– ఈ కారిడార్ ముందుగా ప్రకటించే నోటిఫైడ్ రోజులు మినహా మిగిలిన అన్ని రోజులూ తన కార్యకలాపాలు సాగిస్తుంది.
-యాత్రికులు విడివిడిగా, బృందాలుగా , నడిచికూడా వెళ్లవచ్చు.
-యాత్రికుల జాబితాను ఇండియా వారి యాత్రకు పదిరోజుల ముందే పాకిస్థాన్ కు పంపుతుంది. ఇందుకు సంబంధించిన ధృవీకరణను ప్రయాణ తేదీకి నాలుగు రోజుల ముందు యాత్రికులకు పంపడం జరుగుతుంది.
-లంగార్, ప్రసాదం పంపిణీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు పాకిస్థాన్, ఇండియాకు హామీ ఇచ్చింది.
రిజిస్ట్రేషన్‌కు పోర్టల్
యాత్రికులు prakashpurb550.mha.gov.in పోర్టల్ ద్వారా తమ పేర్లను ఆన్లైన్ లో తప్పకుండా రిజిస్టర్ చేయించుకుని తమకు నచ్చిన తేదీన ప్రయాణానికి నమోదు చేసుకోవచ్చు.ప్రయాణ తేదీకి 3 లేదా 4 రోజుల ముందు ప్రయాణికులకు వారి ప్రయాణానికి సంబంధించిన ధృవీకరణను ఎస్.ఎం.ఎస్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్‌కు వీలు కల్పిస్తారు. ప్రయాణికులు పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌కు వచ్చేటపుడు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్‌ను తమ పాస్ పోర్టుతోపాటు తమ వెంట ఉంచుకోవాలి
The Kartarpur corridor will deepen the connect between lakhs of pilgrims and Shri Guru Nanak Dev Ji.
— Narendra Modi (@narendramodi) November 9, 2019
It is my honour to have inaugurated the corridor today. pic.twitter.com/hsoXkAuBMu