Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు


హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలనీవికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడాలన్న ఉమ్మడి సంకల్పంతో ముందుకు రావాలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారుభారతదేశ ప్రతిష్ఠకు త్రివర్ణ పతాకం చిహ్నమనీదేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ప్రతి పౌరునికీ నిరంతరం స్ఫూర్తినిస్తుందనీ  శ్రీ మోదీ అన్నారు.

జాతీయ గేయం 150వ వార్షికోత్సవాలను దేశం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని వందేమాతరానికి అంకితం చేయడం పట్ల శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:

మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణందేశం కోసం ఉత్తమ రీతిలో కృషి చేయడంలో ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తోంది.

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో మనందరం ఉత్సాహంగా పాల్గొందాంవికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పునరుద్ధరించుకుందాంవందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రయత్నాలను జాతీయ గేయానికి అంకితం చేయడం హర్షణీయం.

https://harghartiranga.com

 

***