Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

100 వ ఉపగ్ర‌హాన్ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకు ఐఎస్ఆర్ఒ బృందాన్ని అభినందించిన‌ ప్ర‌ధాన మంత్రి


100 వ ఉపగ్ర‌హాన్ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకు ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) బృందాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“ఈ రోజు పిఎస్ఎల్‌వి ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన సంద‌ర్భంగా ఇస్రో కు మ‌రియు ఆ సంస్థ శాస్త్రవేత్త‌ల‌కు నా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు. కొత్త సంవ‌త్స‌రంలో సాధించిన ఈ విజ‌యం అంత‌రిక్ష సాంకేతిక విజ్ఞాన రంగంలో దేశం వ‌డివ‌డిగా వేసిన అడుగుల తాలూకు ప్ర‌యోజ‌నాల‌ను మ‌న పౌరుల‌కు, వ్య‌వ‌సాయ‌దారుల‌కు, మ‌త్స్య‌కారుల‌కు త‌దిత‌రులంద‌రికీ అందించగలుగుతుంది.

ఇస్రో 100 వ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం ఆ సంస్థ యొక్క సుప్ర‌సిద్ధ‌ విజ‌యాల‌తో పాటు భార‌త‌దేశ రోద‌సి కార్య‌క్ర‌మ ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్తును కూడా సూచిస్తోంది.

భార‌త‌దేశం సాధించిన విజ‌యం తాలూకు లాభాలు మ‌న భాగ‌స్వాముల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ రోజు ప్రయోగించినటువంటి 31 ఉప‌గ్ర‌హాల‌లో 28 ఉప‌గ్ర‌హాలు 6 ఇత‌ర దేశాల‌కు చెందినవి’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.