పిఎంఇండియా
|
1 |
ఆర్థిక భద్రత విషయంలో భారత్-జపాన్ సంయుక్త ప్రకటన |
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏఐతో కూడిన సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికత, ఔషధాలు వంటి కీలక రంగాల్లో ఉమ్మడి దృఢత్వాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కీలక రంగంలో పెరుగుతున్న భారత్-జపాన్ జీటూజీ (ప్రభుత్వాల మధ్య), బీటూబీ (వ్యాపారాల మధ్య) భాగస్వామ్యాన్ని ‘ఇండియా-జపాన్ ఫ్యాక్ట్ షీట్ 2.0’ స్పష్టంగా తెలియజేస్తుంది. |
|
2 |
కృత్రిమ మేధస్సు రంగంలో సహకారంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన |
ఇది ఏఐ రంగంలో భారత్-జపాన్ సంబంధాలను వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తుంది. ‘భారత్-జపాన్ ఏఐ ఇనిషియేటివ్’ ఆధారంగా రూపొందించిన ఈ ఉమ్మడి ప్రకటన.. సురక్షితమైన, నమ్మకమైన, అందరికీ అందుబాటులో ఉండే మానవ కేంద్రిత ఏఐ అనే ఉమ్మడి లక్ష్య సాధన కోసం సంపూర్ణ ఏఐ సాంకేతిక స్టాక్‌లో (ఏఐ టెక్నాలజీ స్టాక్) మరింత విస్తృతమైన సహకారానికి ఒక రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది. |
|
3 |
ఇంధన దృఢత్వంపై సంయుక్త ప్రకటన (సహజవాయువు-పెట్రోలియం శాఖ, జపాన్‌కు చెందిన ఎంఈఐటీ మధ్య) |
ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వ్యూహాత్మక నిల్వలు, రిజర్వ్ వ్యవస్థలలో సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. సముద్ర ఇంధన రవాణా విలువ గొలుసు విషయంలో ఉమ్మడి పెట్టుబడుల దిశగా సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. |
|
4 |
భారత్-జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని నిర్వహించటం |
దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2027 సంవత్సరాన్ని ‘భారత్-జపాన్ ఇయర్ ఆఫ్ షేర్డ్ హోరైజన్స్’గా నిర్వహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల ప్రణాళికను ఇది తెలియజేస్తుంది. |
|
5 |
భారత్-జపాన్ సహకార బయోగ్యాస్ వృద్ధి (సీబీజీ) కార్యక్రమం కోసం సహకార అవగాహన ఒప్పందం |
పాల సహకార సంఘాల విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటూ భారతదేశమంతటా 1,000 బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల కేంద్రాలను నిర్మించే లక్ష్యం దిశగా సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. |
|
6 |
బ్యాటరీల రంగంలో సహకార ఒప్పందం |
నమ్మకమైన, దృఢత్వం కలిగిన సుస్థిర బ్యాటరీ సరఫరా గొలుసును నిర్మించే లక్ష్యంతో బ్యాటరీ ఆధారిత ప్రాజెక్టుల్లో సహకారాన్ని పెంపొందించడానికి, వ్యాపార అవకాశాలను విస్తరించడానికి ఇది తోడ్పడుతుంది. |
|
7 |
ఔషధాలు, వైద్య పరికరాల రంగంలో సహకార ఒప్పందం |
ద్వైపాక్షిక పెట్టుబడులు, వ్యాపార అనుసంధానాలు, సాంకేతిక సహకారం, పరిశ్రమ-విద్యాసంస్థల ఉమ్మడి భాగస్వామ్యాల ప్రోత్సాహం ద్వారా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), కీ స్టార్టింగ్ మెటీరియల్స్‌తో (కేఎస్ఎం) కూడిన ఫార్మా సరఫరా గొలుసులను ఇది మరింత బలోపేతం చేస్తుంది. |
|
8 |
భూగర్భ శాస్త్రం, ఖనిజ అన్వేషణ రంగంలో సహకార ఒప్పందం |
సాంకేతిక నైపుణ్యాల మార్పిడి ద్వారా అప్‌స్ట్రీమ్ కీలక ఖనిజాల అన్వేషణలో సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. |
|
9 |
ఇండియా ఏఐ మిషన్, జపాన్ ఆర్థిక- వాణిజ్య- పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీ) మధ్య సహకార అవగాహన ఒప్పందం |
భారత దేశపు’ఇండియా ఏఐ మిషన్’, జపాన్ దేశపు ‘జీనియాక్’ కార్యక్రమాల మధ్య సంస్థాగత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. వ్యాపార అనుసంధానం, ఏఐ విధానాలు, సవాళ్లపై వెబ్‌నార్లు, కంప్యూటింగ్ వనరుల సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఉమ్మడి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం వంటి మార్గాలతో ఈ సహకారం కొనసాగనుంది. |
|
10 |
నవతరం మొబిలిటీ భాగస్వామ్యంపై (ఎన్‌జీఎంపీ) సహకార ఒప్పందం |
2025 ఆగస్ట్‌లో జరిగిన 15వ వార్షిక సదస్సులో ప్రకటించిన ‘నవతరం మొబిలిటీ భాగస్వామ్యాన్ని’ (ఎన్‌జీఎంపీ) అమలులోకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్‌జీఎంపీ… రైల్వేలు, వాహనాలు, రోడ్డు మౌలిక సదుపాయాలు, విమానయానం, నౌకా నిర్మాణం, ఓడరేవులు, లాజిస్టిక్స్, పట్టణాభివృద్ధి వంటి రవాణా-మొబిలిటీ రంగాల్లో ప్రైవేట్ రంగ నేతృత్వంలోని సహకారాన్ని, పెట్టుబడులను వేగవంతం చేస్తుంది. దీనిద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి వీలుగా భారత్‌ను ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ కేంద్రంగా తీర్చిదిద్దుతుంది. |
|
11 |
భారత్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్ (సీ-క్యాంప్), జపాన్‌లోని రికెన్ మధ్య అవగాహన ఒప్పందం |
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణ రంగాల్లో డీప్-టెక్, జీవ శాస్త్రాల విద్యాసంబంధిత, ట్రాన్స్‌లేషనల్ పరిశోధనలు, అంకుర ఆధారిత ఆవిష్కరణలను పెంపొందించడానికి ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. |
|
12 |
నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, జపాన్‌లోని రికెన్ మధ్య అవగాహన ఒప్పందం |
రెండు ప్రముఖ పరిశోధనా సంస్థల మధ్య ప్రాథమిక జీవశాస్త్రం, న్యూరోసైన్స్ పరిశోధనలలో సహకారం కోసం ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. |
|
13 |
ఐఐటీ బాంబే, భారత్‌జెన్ టెక్నాలజీ ఫౌండేషన్, జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ మధ్య అవగాహన ఒప్పందం |
ఉమ్మడి పరిశోధనల మార్పిడి ద్వారా శాస్త్రీయ విశ్లేషణను మెరుగుపరిచే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రంగంలో సహకారాన్ని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుంది. |
|
14 |
ఎల్ఎల్ఎం అభివృద్ధిపై సర్వమ్ఏఐ, ప్రిఫర్డ్ నెట్‌వర్క్ మధ్య అవగాహన ఒప్పందం |
ఫౌండేషన్ మోడల్స్‌తో సహా సంపూర్ణ ఏఐ సాంకేతిక స్టాక్‌లో సహకారం కోసం ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. |
|
15 |
నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎక్స్ఐ), జపాన్ నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (జేపీఎన్ఐసీ) మధ్య అవగాహన ఒప్పందం |
నేషనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ కార్యకలాపాలు, ఐపీవీ6 అమలు, ఇంటర్నెట్ భద్రతా మెరుగుదలలు, సామర్థ్య పెంపు, విద్యార్థులు లేదా నిపుణుల మార్పిడి కార్యక్రమాలు.. ప్రాంతీయ, ప్రపంచ వేదికలపై ఇంటర్నెట్ గవర్నెన్స్ గురించి అభిప్రాయాల మార్పిడి వంటి అంశాల్లో సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. |
|
16 |
అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల అథారిటీ (ఐఎఫ్ఎస్ సీఏ), జపాన్ ఆర్థిక సేవల ఏజెన్సీ (జేఎఫ్ఎస్ఏ) మధ్య పత్రాల (లెటర్స్) మార్పిడి |
ఆర్థిక సేవల అభివృద్ధి, నియంత్రణ- పర్యవేక్షణతో పాటు ముఖ్యంగా ఫిన్‌టెక్, రెగ్‌టెక్ రంగాల్లో ఆర్థిక-మార్కెట్ పోకడలు, ఉత్తమ పద్ధతులపై సమాచార మార్పిడి కోసం ఇది ఒక సహకార ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. |
క్ర. సం. | నిర్ణయం | వివరణ |
|---|
***
These outcomes reflect the commitment to deepening the India-Japan cooperation across key sectors and unlocking new opportunities for growth, innovation and development. https://t.co/sGmcNFW0fy
— Narendra Modi (@narendramodi) July 2, 2026
It is wonderful to meet Prime Minister Sanae Takaichi in Delhi. Japan is an important partner of India and we are confident that our ties will get even stronger in the times to come. Our talks today covered the full range of the India-Japan Special Strategic and Global… pic.twitter.com/uxVvrOj2u6
— Narendra Modi (@narendramodi) July 2, 2026
Prime Minister Takaichi and I believe that technology partnership will become the strongest pillar of our cooperation. To realise this vision, we have today issued a Joint Statement in the field of AI. Several leading institutions of India’s AI ecosystem have also signed… pic.twitter.com/KoqrFdzYCI
— Narendra Modi (@narendramodi) July 2, 2026