పిఎంఇండియా
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్పాదకత ఆధారిత రివార్డు (ప్రొడక్టివిటీ లింక్ డ్ రివార్డు ..పిఎల్ఆర్)ను కొనసాగిస్తారు. దీని ప్రకారం 2014-15, 2015-2016 సంవత్సరాలకుగాను ఓడ, నౌకాశ్రయాల్లో పని చేసే ఉద్యోగులకు పిఎల్ఆర్‌ను చెల్లిస్తారు. 2014-15 సంవత్సరానికిగాను ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తాన్ని తాత్కాలికంగా చెల్లించి ఉంటే దాన్ని మినహాయించి మిగతా సొమ్మను చెల్లిస్తారు.
పిఎల్ఆర్ కోసం చేసే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించదు. దీన్ని మేజర్ పోర్ట్ ట్రస్టులు, డాక్ లేబర్ బోర్డులే చెల్లిస్తాయి.
దీని ద్వారా 44 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు లబ్ధి పొందుతారు. తద్వారా నౌకాశ్రయాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఉత్పాదకత పెరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే నౌకాశ్రయాలకు, డాక్ లేబర్ బోర్డులకు తెలియజేయడం జరుగుతుంది. వారికి ఏ తేదీలలోపు పిఎల్ఆర్ చెల్లించాలో తెలియజేస్తారు.