Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2017 న‌వంబ‌ర్ లో హైద‌రాబాద్ లో గ్లోబ‌ల్ ఆంత్ర‌ప్ర‌న‌ర్ షిప్ స‌మిట్ (జిఇఎస్‌)కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న భార‌త‌దేశం, యుఎస్‌ లు


భార‌త‌దేశం మ‌రియు యుఎస్ లు కలసి, గ్లోబ‌ల్ ఆంత్ర‌ప్ర‌న‌ర్ షిప్ స‌మిట్ (జిఇఎస్‌)కు 2017 న‌వంబ‌ర్ 28-30వ తేదీల మ‌ధ్య హైద‌రాబాద్ లో ఆతిథ్యమివ్వ‌నున్నాయి.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న ట్విట‌ర్ అకౌంట్ లో వ‌రుస‌గా న‌మోదు చేసిన ట్వీట్ ల‌లో:

‘‘భార‌త‌దేశం మ‌రియు యుఎస్ లు గ్లోబ‌ల్ ఆంత్ర‌ప్ర‌న‌ర్ షిప్ స‌మ్మిట్ (జిఇఎస్‌)కు2017 న‌వంబ‌ర్ 28-30వ తేదీల మ‌ధ్య హైద‌రాబాద్ లో స‌హ ఆతిథ్యాన్ని ఇవ్వ‌నున్నాయి.

ఈ శిఖ‌రాగ్ర స‌భ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు మరియు స్టార్ట్- అప్ లు ప్ర‌పంచ నేత‌ల‌తో భేటీ అయ్యేందుకు ఒక అపూర్వమైనటువంటి అవ‌కాశాన్ని కల్పిస్తుంది.

హైద‌రాబాద్ లో జ‌రిగే గ్లోబ‌ల్ ఆంత్ర‌ప్ర‌న‌ర్ షిప్ స‌మిట్ – 2017 కు తరలివచ్చే యుఎస్ ప్ర‌తినిధి వ‌ర్గానికి నాయకురాలుగా ఇవాంకా ట్రంప్ హాజరవుతారని నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

****