Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018, జులై 14వ మ‌రియు 15వ తేదీల‌లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని తూర్పు ప్రాంతాల‌ను సంద‌ర్శించనున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, జులై 14వ మ‌రియు 15వ తేదీల‌లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ఆజ‌ంగ‌ఢ్‌, మిర్జాపుర్ ఇంకా వారాణ‌సీ జిల్లాల‌ను సంద‌ర్శించ‌నున్నారు.

జులై 14వ తేదీ నాడు ఆజ‌ంగ‌ఢ్‌ లో ప్ర‌ధాన మంత్రి 340 కి.మీ. పొడ‌వైన పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే కు శంకుస్థాప‌న చేస్తారు. ఈ ర‌హ‌దారి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బారాబ‌ంకీ, అమేఠీ, సుల్తాన్‌పుర్‌, ఫైజాబాద్‌, ఆంబేడ్ కర్ న‌గ‌ర్‌, ఆజ‌ంగ‌ఢ్‌, మ‌వూ, ఇంకా ఘాజీపుర్ త‌దిత‌ర ముఖ్య‌మైన చారిత్ర‌క ప‌ట్ట‌ణాల‌ను రాష్ట్ర రాజ‌ధాని ల‌ఖ్ న‌వూ తో జోడిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం ఒకసారి పూర్తి అయ్యిందంటే గనక దీని ద్వారా ఢిల్లీ ని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రం లో ప‌శ్చిమాన నోయెడా నుండి తూర్పు న ఘాజీపుర్ వ‌ర‌కు గల అనేక ముఖ్య ప‌ట్ట‌ణాలతోను న‌గ‌రాల తోను సంధానించడం సాధ్యపడుతుంది.

ప్ర‌ధాన మంత్రి 900 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువైన ప‌లు ముఖ్య‌మైన ప‌థ‌కాల‌ను వారాణ‌సీ లో ప్రారంభించ‌డ‌మో లేదా శంకుస్థాప‌న చేయ‌డ‌మో చేస్తారు. దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం కానున్న ప‌థ‌కాల‌లో వారాణ‌సీ న‌గ‌ర గ్యాస్ పంపిణీ ప‌థ‌కం తో పాటు వారాణ‌సీ- బ‌లియా ఇఎమ్‌యు రైలు ప్రాజెక్టు కూడా ఉన్నాయి. పంచ్‌కోశి ప‌రిక్ర‌మ మార్గ్ తో పాటు స్మార్ట్ సిటీ మిశ‌న్‌, ఇంకా న‌మామి గంగే ల‌లో భాగంగా అనేక ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేయ‌డం జ‌రుగుతుంది. ప్ర‌ధాన మంత్రి వారాణ‌సీ లో ఒక అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌న కేంద్ర నిర్మాణ పనులకు కూడా పునాది రాయి ని వేయనున్నారు.

మ‌రొక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ‘‘మేరి కాశీ’’ (నా కాశీ) అనే పేరు గల ఒక పుస్త‌కాన్ని ఆవిష్క‌రిస్తారు.

ప్ర‌ధాన మంత్రి జులై 15వ తేదీన మిర్జాపుర్ ను స‌ద‌ర్శించి, బ‌న్‌ సాగ‌ర్ కాలువ ప‌థ‌కాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తారు. ఈ ప‌థ‌కం ఆ ప్రాంతం లో సాగునీటి పారుద‌ల‌కు ఒక పెద్ద ద‌న్నుగా నిలువ‌నుంది. ఇది ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని మిర్జాపుర్ మ‌రియు అల‌హాబాద్ జిల్లాల రైతుల‌కు గొప్ప ప్ర‌యోజ‌నాన్ని అందించగలుగుతుంది.

ఇదే కార్య‌క్ర‌మంలో, మిర్జాపుర్ వైద్య క‌ళాశాల‌కు శ్రీ న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేస్తారు. రాష్ట్రంలో 108 జ‌న్ ఔష‌ధీ కేంద్రాల‌ను ఆయ‌న ప్రారంభిస్తారు. చునార్ లోని బాలు ఘాట్ వాద్ద గంగా న‌ది పైన నిర్మాణం జ‌రిగిన ఒక సేతువు ను కూడా దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అంకితం చేస్తారు. ఈ వంతెన మిర్జాపుర్ కు, వారాణ‌సీ కి మ‌ధ్య సంధానానికి తోడ్పడుతుంది.

**