పిఎంఇండియా
వియత్నాంలోని డా నాంగ్ నగరంలో జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్షిప్స్లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన భారత రెజ్లర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
ఈ ఛాంపియన్షిప్స్లో మన పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు ‘టీమ్ టైటిల్స్‘ సొంతం చేసుకోవటాన్ని ప్రధాని కొనియాడారు.
పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టు 4 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 9 పతకాలను కైవసం చేసుకుందన్న ప్రధాని.. అండర్ 23 ఆసియా ఛాంపియన్షిప్స్ చరిత్రలోనే ఇది భారతదేశపు అత్యుత్తమ పతకాల రికార్డు అని పేర్కొన్నారు.
మహిళల రెజ్లింగ్ బృందం కూడా 6 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 10 పతకాలను సాధించిందని ఆయన వ్యాఖ్యానించారు.
వీటితో పాటు గ్రెకో-రోమన్ రెజ్లింగ్ జట్టు కూడా మొత్తం 8 పతకాలతో తన చరిత్రలోనే అత్యధిక పతకాలను కైవసం చేసుకుందని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
రెజ్లర్లను ప్రశంసించిన ప్రధాని.. భవిష్యత్తులో వారికి మంచి విజయాలు కలగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“మన రెజ్లర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు.
వియత్నాంలోని డా నాంగ్ వేదికగా జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్షిప్లో మన పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ ఛాంపియన్షిప్ టైటిళ్లను కైవసం చేసుకున్నాయి.
పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టు 4 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 9 పతకాలను కైవసం చేసుకుంది. తద్వారా అండర్ 23 ఆసియా ఛాంపియన్షిప్ చరిత్రలో భారతదేశపు అత్యధిక పతకాల రికార్డును నమోదు చేసింది. మహిళల రెజ్లింగ్ విభాగంలో 6 స్వర్ణాలతో సహా మొత్తం 10 పతకాలు వచ్చాయి. మరోవైపు గ్రెకో–రోమన్ రెజ్లింగ్ జట్టు సైతం 8 పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ సరికొత్త చరిత్ర లిఖించింది.
మన రెజ్లర్లందరికీ అభినందనలు. రాబోయే రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. “
***
An outstanding performance by our wrestlers!
— Narendra Modi (@narendramodi) May 28, 2026
Our Men’s Freestyle and Women’s Wrestling teams won the Team Titles at the 2026 U23 Asian Championships in Da Nang, Vietnam.
The Men’s Freestyle Wrestling team secured 9 medals, including 4 Golds, thus registering India’s… pic.twitter.com/41PruCuk1U