Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జావెలిన్ త్రోలో కాంస్య పతకం గెలిచిన యశ్ వీర్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలిచిన యశ్ వీర్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యశ్ వీర్ సింగ్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆసక్తిని, అంకితభవాన్ని చాటుకున్నాడని ప్రధానమంత్రి అన్నారు.

అతని విజయం యువ క్రీడాకారులందరికీ స్ఫూర్తినిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అతను భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కాంక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“పురుషుల జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలిచిన యశ్ వీర్ సింగ్‌కు శుభాకాంక్షలు! యశ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆసక్తిని, అంకితభవాన్ని చాటుకున్నాడు. అతని విజయం యువ క్రీడాకారులందరికీ స్ఫూర్తి. అతను భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా”.

 

***