పిఎంఇండియా
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 69 కేజీల విభాగంలో రజతం సాధించిన హర్జీందర్ కౌర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
హర్జీందర్ ప్రదర్శన వ్యక్తిగతంగా ఉత్తమమైనదని, భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుతంగా రాణించటం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు.
భవిష్యత్తులో హర్జీందర్ కౌర్ మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 69 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన హర్జీందర్ కౌర్‌కు శుభాకాంక్షలు. నిన్న ఆమె చేసిన ప్రదర్శన వ్యక్తిగతంగా ఉత్తమమైనది. కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుతంగా రాణించటం సంతోషకరం. భవిష్యత్తులో హర్జీందర్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా“.
***
Congratulations to Harjinder Kaur for winning a Silver in the Women's 69 kg event at the Commonwealth Games in Glasgow. Also noteworthy is the fact that her performance yesterday was a personal best. It is gladdening to see our weightlifters perform so well in the Games. My best… pic.twitter.com/uK7igceWWv
— Narendra Modi (@narendramodi) July 29, 2026