Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

9 బిలియన్ యుఎస్ డాలర్ల ఎక్స్ పోర్ట్ క్రెడిట్ కోసం భారతదేశానికి, కొరియా కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 9 బిలియన్ యుఎస్ డాలర్ల ఎక్స్ పోర్ట్ క్రెడిట్ కు సంబంధించి ఎక్స్ పోర్ట్ – ఇమ్ పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు)కు, ఎక్స్ పోర్ట్ – ఇమ్ పోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియా (కెగ్జిమ్)కు మధ్య ప్రతిపాదించినటువంటి ఒక అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ఆమోదం తెలిపారు. భారతదేశంలో అవస్థాపన రంగ అభివృద్ధి తో పాటు, థర్డ్ కంట్రీస్ లో అమలయ్యే పథకాల కోసం వస్తువులు, సేవల సరఫరాలకు కూడా ఈ ఎక్స్ పోర్ట్ క్రెడిట్ ను ఉద్దేశించారు.

2017 జూన్ 14-15వ తేదీలలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ కొరియాలోని సియోల్ లో జరుగనున్న యాన్యువల్ ఫైనాన్షియల్ బైలేటరల్ డైలాగ్ కార్యక్రమానికి హాజరయ్యే సందర్భంలో ప్రతిపాదిత ఎమ్ఒయు పైన ఈ రెండు బ్యాంకులకు మధ్య సంతకాలు జరుగనున్నాయి. భారతదేశ అంతర్జాతీయ ఎగుమతులను ఈ నిర్ణయం ప్రోత్సహించడంతో పాటు, భారతదేశానికి, కొరియాకు మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయగలదని ఆశిస్తున్నారు. భారతదేశంలో స్మార్ట్ సిటీస్, రైల్వేలు, విద్యుత్ ఉత్పాదన మరియు ప్రసారం వగైరా ప్రాధాన్య రంగాలలో అమలవుతున్న పథకాలను ప్రోత్సహించడానికి ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చేందుకు ఎక్స్ పోర్ట్ క్రెడిట్ ను వినియోగిస్తారు. అలాగే, థర్డ్ కంట్రీస్ లో అమలయ్యే పథకాలకు భారతదేశం నుండి, కొరియా నుండి వస్తువులు మరియు సేవల సరఫరా కోసం కూడా ఎక్స్ పోర్ట్ క్రెడిట్ ను వినియోగిస్తారు.

అమలుకు సంబంధించిన వ్యూహం

ఆర్థిక సహాయం ఏయే రూపాలలో ఉండాలి, ప్రస్తుతం ఉన్న సర్దుబాటుల పైన సమీక్ష, ఇంకా సంబంధిత విధానాలను ఖరారు చేయడం కోసం ఎమ్ఒయు లో భాగస్వాములైన పక్షాలు- అమలు సంబంధిత వ్యూహంలో భాగంగా- పరస్పరం సంప్రదింపులు జరుపుతాయి. భారతదేశంలో ఆచరణీయ పథకాలను ఎగ్జిమ్ బ్యాంకు గుర్తించనుంది. కాగా, థర్డ్ కంట్రీస్ లో ప్రాజెక్టులను ఇరు పక్షాలు సంయుక్తంగా గుర్తిస్తాయి. 9 బిలియన్ యూఎస్ డాలర్లను ఇన్వెస్ట్ మెంట్ క్రెడిట్ మార్గంలో కెగ్జిమ్ అందజేస్తుందని ఎగ్జిమ్ బ్యాంకు వర్గాల ద్వారా తెలిసింది. (కొంత మేరకు కొరియా దిగుమతి చేసుకొనే నిబంధన తో పాటు ఒఇసిడి ఎక్స్ పోర్ట్ క్రెడిట్ మార్గదర్శకాల మేరకు ఉండే వడ్డీ రేట్ల పై ఎక్స్ పోర్ట్ క్రెడిట్ సదుపాయాన్ని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం కోసం వినియోగిస్తుంటారు). ఈ సొమ్మును ఫైనాన్షియర్ గా కెగ్జిమ్ కూడా వినియోగించుకోవచ్చు; ఎగ్జిమ్ బ్యాంకు తాను సంతృప్తి చెందితే, ఇందులో పాలుపంచుకోనక్కర లేదు.

థర్డ్ కంట్రీస్ లో అమలయ్యే పథకాలకు భారతదేశం నుండి, కొరియా నుండి వస్తువులు, సేవల లభ్యతను ఒక అదనపు అవకాశంగా ఈ ఎమ్ఒయు ప్రసాదిస్తుంది. ఆయా రంగాలలో అమలుపరిచే కార్యక్రమాలకు సంబంధించిన ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలకు అందించే ఆర్థిక సహాయం తాలూకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, ప్రాజెక్టు మదింపునకు, ఇంకా.. ఒక దేశం అనుభవాన్ని మరొక దేశం అందుకోవడానికి సైతం ఈ ఎమ్ఒయు తోడ్పడుతుంది.

పూర్వరంగం

2015 సంవత్సరంలో ప్రధాన మంత్రి కొరియా గణతంత్రంలో పర్యటించినప్పుడు, భారతదేశంలో అవస్థాపన రంగ అభివృద్ధికి 10 బిలియన్ యుఎస్ డాలర్ల మేరకు సాయం చేసేందుకు సిద్ధమని కొరియా పేర్కొన్నట్లు సంయుక్త ప్రకటన వెలువడింది. దీనికి అనుగుణంగా, ఆ తరువాత ఒక ప్యాకేజీని రూపొందించారు. ఆ ప్యాకేజీలో – ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి అందే ఆర్థిక సాయం కింద ఒక బిలియన్ యుఎస్ డాలర్లను దక్షిణ కొరియాకు చెందిన ఎకనామిక్ డివెలప్ మెంట్ కార్పొరేషన్ ఫండ్ (ఇడిసిఎఫ్) అందించేటట్లుగాను, తొమ్మిది బిలియన్ యుఎస్ డాలర్లను కెగ్జిమ్ నుండి ఎక్స్ పోర్ట్ క్రెడిట్ రూపంలో ఇచ్చేటట్లుగాను – పొందుపరిచారు. ఈ 9 బిలియన్ యూఎస్ డాలర్ల రుణం కెగ్జిమ్ కు, ఎగ్జిమ్ బ్యాంకుకు మధ్య కుదిరే ఒక ఎమ్ఒయు లో పేర్కొన్న మేరకు లభించనుంది.